Begin typing your search above and press return to search.

చిరంజీవి మద్దతు కూటమికి ప్లస్ నా......!?

చిరంజీవి పార్టీ పెట్టారు అంటే చొక్కాలు చించుకుని మరీ ఆ సామాజిక వర్గం ఆయన కోసం పనిచేసింది

By:  Tupaki Desk   |   23 April 2024 2:30 AM GMT
చిరంజీవి మద్దతు  కూటమికి  ప్లస్ నా......!?
X

ఆయన వెండి తెర మీద మెగాస్టార్. కానీ పొలిటికల్ గా ఆయనకు ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. ఆయన ప్రజారాజ్యం పెట్టి ఎంతో మందిలో ఆశలు పెంచి చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తాను ఆరేళ్ల పాటు పెద్దల సభలో ఉండేలా రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారని. అలాగే రెండేళ్ల పాటు కేంద్ర మంత్రిగా అధికారం అనుభవించారు అని విమర్శలు ఉన్నాయి.

చిరంజీవి పార్టీ పెట్టారు అంటే చొక్కాలు చించుకుని మరీ ఆ సామాజిక వర్గం ఆయన కోసం పనిచేసింది. ఈ క్రమంలో తమ ప్రాంతాలలో అప్పటికే ఉన్న వేరే సామాజిక వర్గం నేతలను రాజకీయ ప్రముఖులను ధిక్కరించి మరీ ఎదురు నిలిచిన నాయకులు కూడా ఎందరో ఉన్నారు.

వారంతా తాను ఏపీలో ఆల్టరేషన్ గా ఉంటామని కొత్త రాజకీయం చేస్తామని తమకు చిరంజీవి కొండంత అండగా ఉంటారని ఆశించారు. ఇక గోదావరి జిల్లాలలో అయితే ప్రజారాజ్యం కోసం ఆస్తులు అమ్ముకుని పనిచేసిన బలమైన సామాజిక వర్గం నేతలు చాలా మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అయిన తరువాత తమ రాజకీయం అయోమయం కావడంతో రోడ్డున పడ్డారని విమర్శలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే జనసేన పార్టీ పెట్టినా కూడా కొన్నాళ్ళు కాపులు సైలెంట్ గానే ఉన్నారు. ఆ పార్టీని వారు టెస్ట్ చేసి చూశారు. 2019లో కాపుల నుంచి యూత్ జనసేనకు మద్దతు ఇస్తే 2019 తరువాత మిగిలిన సెక్షన్లు కూడా రావడం మొదలైంది. ఏపీలో 2024 ఎన్నికల్లో జనసేన కింగ్ కానీ కింగ్ మేకర్ గా కానీ కీలక పాత్ర పోషిస్తుందని వారంతా భావించి మద్దతు ఇచ్చారు. కానీ అతి తక్కువ సీట్లు తీసుకుని జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో బలమైన సామాజిక వర్గానికి చెందిన చాలా మంది అంతర్మధనంలో పడ్డారు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో మెగాస్టార్ కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా మేలు జరుగుతుందా లేదా అంటే మేలు కంటే ఇబ్బందులే ఎక్కువ అన్న విశ్లేషణలు ఉన్నాయని అంటున్నారు. తమకూ ఒక పార్టీ ఉండాలని తమకూ రాజ్యాధికారం కావాలని ఆశపడిన బలమైన సామాజిక వర్గానికి మెల్లగా మబ్బులు దిగిపోతున్న నేపధ్యంలో మళ్లీ ప్రజారాజ్యం నాటి అనుభవాలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీలో మొత్తానికి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచారం పెద్ద ఎత్తున చేసి తాను నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించమని చిరంజీవి నాడు కోరినా జనాలు స్పందించలేదని అంటున్నారు. ఇపుడు ఆయన తన మాట విని కూటమి అభ్యర్ధులను గెలిపించమని కోరితే కూడా పెద్దగా ప్రయోజనం ఏమి ఉంటుందన్న చర్చ కూడా ఉంది.

పైగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారు అన్నది అందరికీ తెలుసు. ఆ సందర్భంలో కాపులు కూడా ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి చూస్తే టాలీవుడ్ కే పెద్దగా ఉన్నారు. ఆయన రాజకీయాల నుంచి వచ్చి ఆ వాసనలు తొలగించుకుని మెగాస్టార్ గా కంటిన్యూ అవుతున్నారు. ఇపుడు మళ్లీ ఆ మరకలు అంటించుకుంటే రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీలో టాలీవుడ్ సమస్యలు పరిష్కారానికి కూడా మార్గం చూసుకోవాలి కదా అన్న చర్చ కూడా వస్తోంది.

తెలంగాణా ఎన్నికల వేళ వేలూ కాలూ పెట్టకుండా టాలీవుడ్ ఉందని ఏపీలో కూడా అలాగే ఉంటే బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి. టాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ఆదాయం ఏపీ నుంచే వస్తుందని అలాంటప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు కలసివచ్చేలా చూసుకోవడమే ఉత్తమం అన్న సలహాలూ వస్తున్నాయట. ఏది ఏమైనా మెగాస్టార్ మద్దతు వల్ల కూటమికి కలసివచ్చేదీ లేదని అంటున్నారు. అదే సమయంలో టాలీవుడ్ ప్రయోజనాలు కూడా కాపాడుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.