Begin typing your search above and press return to search.

ఆటపట్టించిన రోబో... ఫిదా అవుతున్న నెటిజన్లు

చైనాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. సహాయం చేయడం, మన పనులను సులభతరం చేసేందుకు రూపొందించిన రోబో ఒక్కసారిగా మానవ స్వభావంతో ప్రవర్తించింది.

By:  Tupaki Desk   |   6 Sept 2025 12:00 AM IST
ఆటపట్టించిన రోబో... ఫిదా అవుతున్న నెటిజన్లు
X

చైనాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. సహాయం చేయడం, మన పనులను సులభతరం చేసేందుకు రూపొందించిన రోబో ఒక్కసారిగా మానవ స్వభావంతో ప్రవర్తించింది. బైక్ పై వస్తున్న ఓ వ్యక్తిపై ఒక్కసారిగా మీద పడినంత పని చేసింది. ఈ సంఘటనను వీడియోగా రికార్డు చేయడంతో, అది క్షణాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రోబోకు హ్యుమర్ సెన్స్ ఉంటే

సాధారణంగా మనం రోబోలను చూస్తే వాటి పనితీరును, సామర్థ్యాన్ని అంచనా వేస్తాము. కానీ ఈసారి ప్రజలను ఆశ్చర్యపరచడంతో పాటు నవ్వించేలా చేసింది. రోబోలు భవిష్యత్తులో పనులను ఆటోమేట్ చేస్తాయని, మానవుల శ్రమను తగ్గిస్తాయని అందరూ అనుకుంటారు. అయితే ఈ సంఘటనలో రోబో మాత్రం ఒక రకంగా ఆటపట్టించిందనే భావన కలిగించింది. దీంతో “రోబోలకు కూడా హ్యుమర్ సెన్స్ ఉంటే ఎలా ఉంటుందో?” ఇది కూడా అలాగే ఉందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

హస్యం కాదు.. సాంకేతిక కోణం

ఈ వీడియో కేవలం ఒక హాస్యపరమైన సంఘటనగానే కనిపించవచ్చు. కానీ దీని వెనుక సాంకేతిక కోణం కూడా ఉంది. రోబోలు ఎంత వేగంగా మానవ ప్రతిస్పందనలను పరీక్షించగలవో, ఎలాంటి పరిస్థితులను సృష్టించగలవో దీనివల్ల తెలుస్తోంది. సైన్స్‌-టెక్నాలజీ అభివృద్ధి దిశలో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత యంత్రాలు మరింత సహజంగా ప్రవర్తిస్తే, మానవుల–రోబోట్‌ల సంబంధం ఏ రూపం దాల్చుతుందో అనేది పెద్ద ప్రశ్న.

టెక్నాలజీలో మరో ముందడుగా?

ఇప్పటికే మన జీవితంలో రోబోలు, ఏఐ(AI)భాగమైపోతున్నాయి. పరిశ్రమల్లో యంత్రాలు ఉత్పత్తి వేగాన్ని పెంచుతున్నాయి. వైద్యరంగంలో సహాయక రోబోలు వైద్యుల పక్కన నిలుస్తున్నాయి. గృహాలలోనూ ఆటోమేషన్ పరికరాలు సాధారణమవుతున్నాయి. అలాంటి సమయంలో రోబోలు “ఆటపట్టించే స్వభావం” చూపించడం టెక్నాలజీ మానవీకరణలో ఒక ఆసక్తికర మలుపుగా చెప్పుకోవాలి.

ప్రమాదాలు తప్పవేమో?

అయితే, దీన్ని కేవలం సరదాగా తీసుకోవాలా? లేక రోబోల ప్రవర్తన నియంత్రణపై మరింత చర్చ జరగాలా? అన్నది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే యంత్రాలు అనూహ్యంగా స్పందిస్తే, అది వినోదానికి మాత్రమే కాక ప్రమాదానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ తరహా అభివృద్ధిలో నైతికత, భద్రత, నియంత్రణ అంశాలు తప్పనిసరిగా పరిగణనలోకి రావాలి. ఈ సంఘటన మరో ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. టెక్నాలజీ ఎంత ఆధునికమైనా, అది మానవుని అంచనాలను మించిపోతూ ఆశ్చర్యపరచగలదు. కాబట్టి భవిష్యత్తులో మనం కేవలం రోబోట్‌ల సహాయాన్ని మాత్రమే కాక, వాటి “అనూహ్య స్పందనలను” కూడా స్వీకరించాల్సి రావచ్చు.

మరిన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయా?

చైనాలో చోటుచేసుకున్న ఈ చిన్న ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒకవైపు సరదాగా నవ్వులు పంచితే, మరోవైపు భవిష్యత్తు సాంకేతికత మనకు ఏ సర్ప్రైజ్‌లు ఇస్తుందో అనే ఆలోచనను రేకెత్తించింది. రోబోట్‌లు హాస్యభావం కలిగి ప్రవర్తిస్తే, మానవ–యంత్ర సంబంధం మరింత కొత్త అర్థం సంతరించుకునే రోజులు దూరంలో లేవేమో!