Begin typing your search above and press return to search.

జగన్ హామీని ముందే ఇచ్చేసిన బాబు ...!

అందులో రైతులు డ్వాక్రా మహిళల రుణ మాఫీతో పాటు సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ అత్యంత కీలకమైన హామీ ఉండబోతోంది అని కూడా అంటూ వచ్చారు.

By:  Tupaki Desk   |   26 March 2024 1:30 AM GMT
జగన్ హామీని ముందే ఇచ్చేసిన బాబు ...!
X

టీడీపీ అధినేత చంద్రబాబు అతి కీలకమైన హామీని ఇచ్చేసారు. నిజానికి ఈ హామీని ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇస్తారని ప్రచారం సాగుతూ వస్తోంది. అన్నీ అనుకూలించి ఉంటే ఈపాటికి వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో రిలీజ్ కూడా అయ్యేది. అందులో రైతులు డ్వాక్రా మహిళల రుణ మాఫీతో పాటు సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ అత్యంత కీలకమైన హామీ ఉండబోతోంది అని కూడా అంటూ వచ్చారు.

ఇపుడు అదే హామీని చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఇచ్చేశారు. తాజాగా ఆయన కుప్పంలో జరిగిన సభలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటికీ ఒకటవ తేదీనే క్రమం తప్పకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని భారీ హామీ ఇచ్చారు.

ఈ హామీ ద్వారా బాబు వైసీపీ మీద రాజకీయంగా పై చేయి సాధించారు అని అంటున్నారు. జగన్ నాలుగు వేల పెన్షన్ హామీ ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ ఆయన రేపటి రోజున ఇచ్చిన బాబు ముందే ఇచ్చారు అన్న మాట వస్తుంది. దానితో పాటు జగన్ విడతల వారీగా అంటే 2025 నుంచి 2029 దాకా ప్రతీ ఏటా 250 వంతున పెంచుతూ ఆలుగు వేల పెన్షన్ ఇస్తారని అంటున్నారు.

కానీ చంద్రబాబు ఒకేసారి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని అంటున్నారు. అది కూడా టీడీపీ గద్దెనెక్కిన వెంటనే అని కూడా పక్కాగా చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే బాబు జూన్ లో కనుక సీఎం గా ప్రమాణం చేస్తే జూలై నుంచే సామాజిక పెన్షన్ పెంచుతారు అని టీడీపీ వర్గాలు చెబుతున్నారు.

ఏపీలో సామాజిక పెన్షన్ లబ్దిదారులు అర కోటికి పై దాటి ఉన్నారు. దాంతో ఇది బ్రహ్మాండమైన వజ్రాయుధం లాంటి హామీగానే ఉంటుంది అని అంటున్నారు. ఇక గతంలో జన్మభూమి కమిటీల ద్వారా సామాజిక పెన్షన్ లబ్దిదారులను ఎంచి ఇచ్చేవారు. వారి వద్దకే వెళ్ళి తీసుకునేవారు.

కానీ ఇపుడు వైసీపీ మాదిరిగానే ఇంటి వద్దకే పెన్షన్ అని బాబు భారీ వరం ఇచ్చేశారు. మరి ఓటర్లను కీలకంగా ప్రభావితం చేసే ఈ హామీని తొలుత టీడీపీ ఇచ్చింది. ఏప్రిల్ తొమ్మిదిన వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో రిలీజ్ అవుతోంది. అందులో ఈ హామీ ఏ విధంగా ఉండబోతోందో చూడాల్సి ఉంది.

ఏది ఏమైనా చూస్తే కనుక చంద్రబాబు సంక్షేమ పధకాలను వరసగా ఒక్కోదానికి వదులుతున్నారు. బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అని ఆయన ఇటీవల ప్రకటించారు. వీటితో పాటు సూపర్ సిక్స్ అని ఆరు హామీలను కూడా చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇక ఎన్నికల మ్యానిఏస్టో తయారీలో టీడీపీ బిజీగా ఉంది. అందులో వైసీపీ నవరత్నాల కంటే రెట్టింపు సంక్షేమం ఉంటుందని అంటున్నారు. దీంతో వైసీపీ దీన్ని ఎలా కౌంటర్ చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు.