Begin typing your search above and press return to search.

ఏపీ పోలీసులకు చంద్రబాబు వార్నింగ్... తెరపైకి ప్రైవేట్ కేసులు!

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన పుంగనూరు ఘటన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ మంత్రులు చంద్రబాబు వైఖరిపై ఫైరవుతున్నారు!

By:  Tupaki Desk   |   7 Aug 2023 7:55 PM IST
ఏపీ పోలీసులకు చంద్రబాబు వార్నింగ్... తెరపైకి ప్రైవేట్ కేసులు!
X

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన పుంగనూరు ఘటన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ మంత్రులు చంద్రబాబు వైఖరిపై ఫైరవుతున్నారు! ఇదే సమయంలో పోలీస్ అధికారుల సంఘం కూడా చంద్రబాబుపై కేసు పెట్టి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ సమయంలో చంద్రబాబు తనదైన తాజా స్టైల్లో స్పందించారు.

అవును... ఏపీ మంత్రులతో పాటు పోలీస్ అధికారుల సంఘం సైతం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు. నాడు జరిగిన ఘటనలోని వీడియో ఫుటేజ్ లు సైతం గమనించిన అనంతరం అరెస్టులు అయ్యాయని తెలుస్తుంది.

ఈ సమయంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగా చిత్తూరు పోలీసులకు వార్నింగ్ ఇచ్చే పనికి పూనుకున్నారు. " పోలీసులపై కోర్టుల్లో ప్రైవేట్ కేసులు వేస్తాం.. టీడీపీ క్యాడర్‌ పై తప్పుడు కేసులు పెట్టే పోలీసులను వదిలిపెట్టబోం.. ఖబడ్దార్..! " అంటూ చంద్రబాబు హెచ్చరించారు!

అనంతరం... టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని మండిపడిన చంద్రబాబు.. పోలీసులు తమ నిర్బంధంలో ఉన్న టీడీపీ నాయకులను కోర్టులో హాజరుపరచకుండా హింసిస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో అరెస్టు చేసి కస్టడీలో హింసకు గురిచేస్తే.. అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కాగా పుంగనూరు సమీపంలోని భీమగానిపల్లె వద్ద చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనకు సంబంధించి 62 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఏలూరులో చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు.

అంగళ్లులో మారణాయుధాలతో దాడులకు యత్నించారని పీలేరు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని వివరించారు. పుంగనూరు ఘటనలో 5, అంగళ్లు ఘటనలో 2 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని బాబు దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు.