Begin typing your search above and press return to search.

హస్తినలో సొంత టీం తో చంద్రబాబు సందడే సందడి!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Jun 2024 6:09 PM IST
హస్తినలో సొంత టీం తో చంద్రబాబు సందడే సందడి!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమి నుంచి ప్రధానిగా మోడీ పేరు ప్రతిపాదించి.. కూటమిలో తాను ఏ స్థాయిలో కీలక వ్యక్తి అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు చంద్రబాబు. మరోపక్క... ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ప్రధాన విభజన హామీలను ఈసారి కచ్చితంగా సాధిస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు!

అవును... కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతోపాటు.. కూటమిలో టీడీపీ కీ రోల్ పోషించే క్రమంలో... ఏపీకి రావాల్సిన విభజన హామీలన్నింటినీ నూటికి నూరు శాతం సాధిస్తారనే నమ్మకంతో ఏపీ వాసులు ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో... అందుకు తొలి అడుగుగా జూన్ 9న ఢిల్లీలో ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం అనంతరం, 12న ఏపీలో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈసారి కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు కీలక భూమిక పోషించాల్సిన క్రమంలో... కీలకంగా కనీసం రెండు, గరిష్టంగా నాలుగు మంత్రి పదవులు సాధిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు హస్తినలో హల్ చల్ చేస్తున్నారు. హస్తినలోని తన కొత్త సైన్యంతో సందడిగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరితోనూ గ్రూప్ ఫోటో దిగారు.

ఇందులో భాగంగా... కొత్తగా ఎంపికైన పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), అప్పల నాయుడు (విజయనగరం), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (నెల్లురు), పుట్టా మహేష్ యాదవ్ (ఏలూరు), ప్రసాద రావు (చిత్తురు), మాగుంట శ్రీనివాసుల రెడ్డి (ఒంగోలు), పార్థసారధి (హిందూపురం), నాగరాజు (కర్నూలు), శబరి (నంద్యాల), లక్ష్మీనారాయణ (అనంతపురం), రామ్మోహన్ (శ్రీకాకుళం), హరీష్ మాధుర్ (అమలాపురం), కేశినేని చిన్ని (విజయవాడ), కృష్ణప్రసాద్ (బాపట్ల), శ్రీకృష్ణదేవరాయులు (నరసరావు పేట), మార్గాని భరత్ (విశాఖ) ఉన్నారు.