Begin typing your search above and press return to search.

తెలంగాణాలో బాబు టార్గెట్ ఆ నంబర్... ?

చంద్రబాబు బయట ఉన్నపుడు కూడా ఖమ్మంలో భారీ మీటింగ్ నిర్వహించారు. ఆ తరువాత హైదరాబాద్ నడిబొడ్డున మరో మీటింగ్ ని నిర్వహించారు

By:  Tupaki Desk   |   18 Oct 2023 2:30 AM GMT
తెలంగాణాలో బాబు టార్గెట్ ఆ నంబర్... ?
X

తెలంగాణా ఎన్నికలు ఇపుడు టీడీపీ ఆశావహంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. తెలంగాణా రూట్ మీదుగా ఏపీకి వచ్చి వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను సానుకూలం చేసుకోవాలన్నది బాబు మార్క్ ఎత్తుగడ. నిజానికి 2018లో కూడా అలాగే చేయాలని అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టీడీపీ అక్కడ పోటీకి దిగింది.

అయితే బీయారెస్ వేసిన తెలంగాణా సెంటిమెంట్ పాచిక పారడంతో టీడీపీ చిత్తు అయింది. ఆ తరువాత బీయారెస్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కూడా ఏపీలో ఒక లెవెల్ లో తగిలి 23 సీట్లకే పరిమితం అయిపోయింది. ఇక ఈసారి మాత్రం తెలంగాణాలో కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నో కొన్ని సీట్లు గెలవాలని టీడీపీ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు బయట ఉన్నపుడు కూడా ఖమ్మంలో భారీ మీటింగ్ నిర్వహించారు. ఆ తరువాత హైదరాబాద్ నడిబొడ్డున మరో మీటింగ్ ని నిర్వహించారు. బాబు లెక్కలేంటి అంటే రెండు సార్లు అధికారంలో ఉన్న బీయారెస్ మీద యాంటీ ఇంకెంబెన్సీ ఒక లెవెల్ లో ఉంటుందని, ఆ మీదట తెలంగాణా సెంటిమెంట్ అని ఈసారి చెప్పినా వర్కౌట్ కాదని దాంతో గతం లో మాదిరిగా గట్టిగా బరిలోకి దిగితే చెప్పుకోదగిన నంబర్ లో సీట్లు తెచ్చుకోవచ్చు అని.

ఆ విధంగానే అంతా అనుకుని బాబు సెట్ చేసుకునేలోగానే జైలు పాలు అయ్యారు. ఇపుడు ఆ సెంటిమెంట్ ని సానుభూతిని ఎన్ క్యాష్ చేసుకునే పనిలో టీడీపీ ఉంది. అందుకే బిగ్ నంబర్ తోనే పోటీకి దిగాలని చూస్తోంది. తెలంగాణాలో జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుని దిగితే ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడితే కింగ్ కావాలని కూడా చూస్తోంది. అప్పటి పరిస్థితులను బట్టి ఏ పార్టీ మ్యాజికి ఫిగర్ కి దగ్గరగా వస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణా అధికారంలో వాటా తీసుకోవాలని కూడా లెక్క ఉంది అంటున్నారు.

ఇక టీడీపీ కనీసంగా పది సీట్లకు తక్కువ లేకుండా ఈసారి గెలవాలని టార్గెట్ పెట్టుకుంది అని అంటున్నారు. ఈ విధంగా గెలిస్తే కనుక రేపటి రోజున హంగ్ ఏర్పడితే తమ పాత్ర చాలా ముఖ్యం అవుతుంది అని భావిస్తోంది. దాత్నో పాటు తెలంగాణాలో పది సీట్లు కనుక గెలిస్తే బాబు అరెస్ట్ జైలు సానుభూతి ఆ మేరకు వర్కౌట్ అయితే ఇక 2024 లో ఏపీలో జరిగే ఎన్నికల్లో తిరుగు ఉండదని కూడా టీడీపీ భావిస్తోంది. ఒక్కసారి తెలంగాణాలో గేర్ మార్చి తమ సత్తా చాటితే ఏపీలో సైతం టీడీపీ స్పీడ్ ని ఎవరూ అందుకోలేరని కూడా భావిస్తోంది. మొత్తం మీద చూస్తే తెలంగాణా నుంచే ఏపీ రాజకీయాన్ని నరుక్కు రావాలని టీడీపీ అనుకుంటోంది.

అంటే గత ఎన్నికల్లో ఎక్కడైతే ఓటమి పాలు అయి ఆ ప్రభావంతో ఏపీలో దెబ్బ తిన్నామో ఇపుడు కూడా దాన్ని సరిచేసుకుంటూ తెలంగాణా నుంచే విక్టరీ సింబల్ ని ఏపీ కి చూపించాలన్నది టీడీపీ వ్యూహం చంద్రబాబు ఎత్తుగడ అంటున్నారు. మరి ఈ విధంగా ఏపీలో వైసీపీని ఉల్టా పల్టా చేయాలంటే జస్ట్ పది సీట్లు వచ్చినా టీడీపీకి చాలు అని అంటున్నారు. ఆ మీదట టీడీపీ దూకుడుని ఏపీలో ఎవరూ అసలు ఆపలేరు అని కూడా ఆ పార్టీ నేతలు ఫిక్స్ అవుతున్నారు. ఇంతకీ తెలంగాణాలో టీడీపీ కి ఉన్న సత్తా ఎంత, బాబు సానుభూతి ఎలా పనిచేస్తుంది అన్నది ఆసక్తిని పెంచే అంశంగానే ఉంది మరి.