బాబుకు సింపతీ దక్కలేదు... టైమ్స్ నౌ తేల్చింది ఇదే...!
కానీ రాలేదు అంటే జనాల మీద బాబు అరెస్ట్ కానీ ఆయన అరెస్ట్ అక్రమం అని టీడీపీ చేస్తున్న ఆందోళన కానీ ఏవీ ప్రభావం చూపించడంలేదు అనుకోవాల్సి వస్తోంది.
By: Tupaki Desk | 2 Oct 2023 5:44 PM GMTసెప్టెంబర్ నెల వరకూ టైమ్స్ నౌ ఏపీలోని రాజకీయ పరిస్థితుల మీద చేసిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతీ పెద్దగా లేదని, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ గా గతంలో వచ్చినట్లుగానే వైసీపీకి టోటల్ 25 ఎంపీ సీట్లలో 24 నుంచి 25 దాకా దక్కుతాయని సర్వే చెప్పదు కదా.
దాన్ని బట్టి చూస్తే స్ట్రాంగ్ గానే వైసీపీ ముందుకు సాగుతోందని, తన ఓటు షేర్ ని అలాగే కంటిన్యూ చేస్తోంది అని సర్వే చెప్పుకొచ్చింది. వైసీపీ పాతికకు పాతిక అయినా ఎంపీ సీట్లు తెచ్చుకోవచ్చు అని ఈ సర్వే చెబుతోంది. అదే టైం లో టీడీపీ కి సున్నా నుంచి ఒక ఎంపీ సీటు వరకూ చాన్స్ ఉందని సర్వే అంటోంది.
నిజంగా ఏపీలో రాజకీయం మారిందని, చంద్రబాబు అరెస్ట్ తరువాత మొత్తంగా 160 ఎమ్మెల్యే సీట్లు ఆ పార్టీ పరం అవుతాయని ఎంపీలు కూడా టీడీపీకే దక్కుతాయని కొంతమంది జోస్యం చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే ఈ కీలక సమయంలో టీడీపీ వైపు జనాలు టర్న్ అయితే మాత్రం సర్వే నివేదిక వేరేగా రావాల్సి ఉంటుంది.
కానీ రాలేదు అంటే జనాల మీద బాబు అరెస్ట్ కానీ ఆయన అరెస్ట్ అక్రమం అని టీడీపీ చేస్తున్న ఆందోళన కానీ ఏవీ ప్రభావం చూపించడంలేదు అనుకోవాల్సి వస్తోంది. ఇక జనసేనది కూడా చిత్రమైన పరిస్థితిగా సర్వే తేల్చింది. జనసేనకు ఓటు షేర్ డబుల్ అవుతుందని ఈ సర్వే చెప్పడం విశేషం.
అంటే 2019లో ఏడు శాతం ఓటింగ్ షేర్ ఉంటే అది కాస్తా లేటెస్ట్ సర్వే నివేదిక ప్రకారం 14 దాకా పెరుగుతుందని లెక్క కడుతోంది. కానీ జనసేనకు మాత్రం ఒక్క సీటు దక్కదని అంటోంది. ఇక్కడ మరో తమాషా కూడా ఈ సర్వే ప్రకారం చూడాల్సి ఉంది అని అంటున్నారు.
అదేంటి అంటే జనసేన పెంచుకున్న ఓట్ల షేర్ ఎక్కడ నుంచి వస్తోంది అని. వైసీపీ ఓటు షేర్ 50 శాతం అలాగే ఉన్నట్లుగా సర్వే చెబుతోంది. అంటే టీడీపీ ఓటు బ్యాంక్ నుంచే జనసేన ఓట్లు చీల్చుకుని తాను నెమ్మదిగా బలపడుతోంది అని అంటున్నారు. అలాంటి నేపధ్యాన్ని చూసుకున్నపుడు టీడీపీతో రేపటి ఎన్నికల్లో జనసేన పొత్తు పెట్టుకున్నా ఆ రెండు పార్టీలకు పెద్దగా కలిసేది ఏదీ ఉండదని సర్వే నివేదికలను బట్టి తెలుస్తోంది అంటున్నారు.
ఇక బీజేపీకి ఏపీలో ఏమీ లేదని రాదని సర్వే చెప్పేసింది. అంతే కాదు తెలంగాణాలో కూడా గతంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి రెండు నుంచి మూడు మాత్రమే వస్తాయని అంటోంది. అంటే ఒక ఎంపీ సీటు ఆ పార్టీ గత ఎన్నికల కంటే కోల్పోతుంది అన్న మాట. ఏది ఏమైనా చూస్తుకుంటే ఏపీలో వైసీపీ స్ట్రాంగ్ బేస్ ని కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతోంది అని అంటున్నారు. మరి దాన్ని బద్ధలు కొట్టడం అతి తక్కువ టైం ఎన్నికలు ఉన్న వేళ సాధ్యమా అన్నదే ఈ సర్వేని చూస్తే ఎవరైనా విశ్లేషించుకోవాల్సి ఉంది అంటున్నారు.