Begin typing your search above and press return to search.

బాబు డబుల్ రూట్ : అటు బీజేపీతో... ఇటు రేవంత్ తో...!?

టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తులకు వెళ్తున్నారు. మరి మధ్యలో తెలంగాణా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రావడం ఏంటి అంటే అక్కడే ఉంది తమషా

By:  Tupaki Desk   |   8 March 2024 8:35 AM GMT
బాబు డబుల్ రూట్ : అటు బీజేపీతో... ఇటు రేవంత్ తో...!?
X

టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తులకు వెళ్తున్నారు. మరి మధ్యలో తెలంగాణా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రావడం ఏంటి అంటే అక్కడే ఉంది తమషా. బాబు మార్క్ పాలిటిక్స్ కూడా అక్కడే ఉంది. చంద్రబాబుకు అన్ని పార్టీలతోనూ లింకులు ఉన్నాయని ప్రచారంలో ఉన్న మాటే. పైగా రేవంత్ రెడ్డి బాబుకు ఒకనాటి శిష్యుడు.

దాంతో ఈ గురు శిష్యుల బంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని కూడా చెబుతూంటారు ఇంతకీ బాబు రేవంత్ రెడ్డి ఎక్కడ కలుసుకున్నారు అన్నదే కదా ఆసక్తిని గొలిపే విషయం. ఈ ఇద్దరూ హైదరాబాబ్ బేగం పేట ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు అని ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. బాబు రేవంత్ రెడ్డి భేటీ టైం తో సహా చెప్పేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం మూడున్నర నుంచి అయిదున్నర మధ్యలో ఈ భేటీ జరిగింది అని కూడా నిర్ధారిస్తున్నారు.

గురువారం చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం అయిన సంగతి తెలిసిందే. బీజేపీ పెద్దలతో పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి తీసుకుని రావడం కోసం బాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అలా ఆయన బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అదే టైం లో ఢిల్లీలో తమ పార్టీ పెద్దలను కలిసేందుకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా బేగం పేట ఎయిర్ పోర్టుకు వచ్చారు అని అంటున్నారు.

దాంతో అనుకోకుండా కలిశారా లేక అనుకుని కలిశారా తెలియదు కానీ గురు శిష్యులు ఇద్దరూ అక్కడ తారసపడ్డారని ఒక కీలక భేటీయే వేశారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అంటే చంద్రబాబు బీజేపీతో పొత్తులకు వెళ్తున్నారు. ఇదే టైం లో కాంగ్రెస్ సీఎం తోనూ భేటీ అవుతారు అన్న మాట.

దేశంలో చూస్తే కాంగ్రెస్ బీజేపీ బద్ధ విరోధులు అయిన పార్టీలు. అయినా చంద్రబాబు మాత్రం బీజేపీతో చెలిమి చేస్తూనే కాంగ్రెస్ తో కూడా స్నేహం కొనసాగించగల రాజకీయ దిట్ట అని అంటున్నారు అంతా. ఇంతకు ముందు చూసుకుంటే బాబు బెంగళూరు ఎయిర్ పోర్టులో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని పక్కకు తీసుకుని వెళ్ళి మరీ ఏకాంత మంతనాలు జరిపినది మీడియాలో వచ్చి తెగ వైరల్ అయింది.

ఇపుడు రేవంత్ రెడ్డి తో బాబు భేటీ ప్రచారంగానే ఉంది తప్ప దానికి సంబంధించి విజువల్స్ అయితే ఏదీ బయటకు రాలేదు. ఏది ఏమైనా తెలంగాణాకు సీఎం అయిన మూడు నెలల అరువాత రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఇలా బేగం పేట ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు అని అంటున్నారు.

మరి ఈ కలయిక వెనక మతలబు ఏంటి అంటే ఏపీలో నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో తెలంగాణా బోర్డర్ నుంచి డబ్బు ట్రాన్స్ ఫర్ సాఫీగా సాగేలా చూసుకునేందుకు ఈ భేటీ అని ప్రచారం మరో వైపు సాగుతోంది. అంటే అంతా సవ్యంగా చక్కబెట్టుకోవడానికే రేవంత్ రెడ్డితో ఈ భేటీ వేశారు అని అంటున్నారు.

అంటే కాంగ్రెస్ దోస్తీ కావాలి బీజేపీతో పొత్తూ కావాలి బాబుకు అని అంటున్నారు. శుభమాని బీజేపీతో పొత్తులకు పోతూ కాంగ్రెస్ సీఎం తో భేటీ ఏమిటీ అంటే చంద్రబాబు రాజకీయమే అంతా అని ప్రత్యర్ధుల నుంచి సెటైర్లు పడుతున్నాయి. బహుశా బాబు లాంటి నేత దేశంలోనే ఎవరూ ఉండరని అంటున్నారు.

ఒక వైపు బీజేపీతో బంధం కావాలి. ఎందుకంటే దేశంలో మరోసారి అధికారంలోకి ఆ పార్టీ రాబోతోంది కాబట్టి. అదే టైం లో కాంగ్రెస్ తోనూ స్నేహం ఉండాలి. సాటి పొరుగు రాష్ట్రం కాబట్టి అక్కడి ప్రయోజనాల కోసం. ఇదే బాబు మార్కు రాజకీయ ఎత్తులు జిత్తులు అని అంటున్నారు.

అసలు చూస్తే కనుక బాబు ఏ రోజూ కాంగ్రెస్ కి దూరంగా లేరు అని అంటున్నారు. ఆయన 2018 నుంచి ఆ పార్టీతో ఉన్నారు. తెలంగాణా ఎన్నికల్లో నేరుగానే పొత్తు పెట్టుకున్నారు. 2019లో రాహుల్ ని ప్రధానిగా చేయాలని దేశమంతా తిరిగారు అని గుర్తు చేస్తున్నారు. ఇపుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కేంద్రంలో మెజారిటీ బీజేపీకి రాకపోతే కాంగ్రెస్ వైపు బాబు ఫిరాయించినా ఫిరాయిస్తారు అని అంటున్నారు.

మరి ఇన్ని జిత్తులతో బీజేపీ వైపు వస్తున్న బాబుని చూసి కమలనాధులు మావాడే అనుకుంటారా ఆయనతో పొత్తులు సవ్యంగా ఉంటాయనుకుని భ్రమపడతారా అన్నది చూదాలని అంటున్నారు. ఆ మీదట చెక్ చేసుకోవడం బీజేపీ వారిదే అంటున్నారు.