Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసులో.. చంద్ర‌బాబుకు బిగ్ రిలీఫ్‌.. !

ఈ కేసులో వేగం పెంచాల‌ని.. సాక్షుల‌ను చంద్ర‌బాబు ప్ర‌భావితం చేస్తున్నార‌ని పేర్కొంటూ.. దాఖ‌లైన పిటిష‌న్‌ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేదు.

By:  Tupaki Desk   |   18 April 2024 8:48 AM GMT
ఓటుకు నోటు కేసులో.. చంద్ర‌బాబుకు బిగ్ రిలీఫ్‌..  !
X

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై 2015లో న‌మోదైన ఓటుకు నోటు కేసులోఆయ‌న‌కు తాజాగా బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఈ కేసులో వేగం పెంచాల‌ని.. సాక్షుల‌ను చంద్ర‌బాబు ప్ర‌భావితం చేస్తున్నార‌ని పేర్కొంటూ.. దాఖ‌లైన పిటిష‌న్‌ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేదు. అంతేకాదు.. కేసు విచార‌ణ‌ను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న క్ర‌మంలో చంద్ర‌బాబుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.

ఏం జ‌రిగింది?

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన‌. స్టీఫెన్‌స‌న్ త‌మ‌కు అనుకూలంగా ఓటు వేయాలంటూ.. ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి. ఆయ‌నకు నోట్ల క‌ట్ట‌లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ఫోన్‌లో మాట్లాడిన చంద్ర‌బాబు 'బ్రీఫ్‌డ్ మీ' అని వ్యాఖ్యానించిన‌ట్టు అప్ప‌టి అధికార పార్టీ బీఆర్ ఎస్ కేసు న‌మోదు చేసింది.ఈ కేసులో రేవంత్ కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్లివ‌చ్చారు.

అయితే.. చంద్ర‌బాబుపై న‌మోదైన కేసు విచార‌ణ త‌ర్వాత కాలంలో మంద‌గించింది. దీనిని స‌వాలు చేస్తూ . వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి.. రెండేళ్ల కింద‌ట సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.దీనిపై అనేక వాద నలు.. ప్ర‌తివాద‌న‌లు వాయిదాలు ప‌డ్డాయి.

తాజాగా గురువారం తుదితీర్పు వెలువ‌డాల్సి ఉంది. చంద్ర‌బాబు పాత్ర ఉందా..? లేదా? అనేది కూడా తేల్చేస్తామ‌ని గ‌త ఏడాది జ‌రిగిన విచార‌ణ‌లో సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ, అనూహ్యంగా కేసును జూలై్ 24కు వాయిదా వేయడంతో చంద్ర‌బాబు కు బిగ్ రిలీఫ్ వ‌చ్చిన‌ట్టు అయింది.