Begin typing your search above and press return to search.

మార్పులుంటాయి... బాబు బాంబు పేల్చారా ?

టీడీపీ అధినేత చంద్రబాబు బాంబు లాంటి వార్తను చెప్పారు. టీడీపీ ప్రకటించిన 144 అసెంబ్లీ సీట్లు అలాగే 17 ఎంపీ సీట్లలో మార్పుచేర్పులు ఉంటాయని

By:  Tupaki Desk   |   10 April 2024 3:46 AM GMT
మార్పులుంటాయి... బాబు బాంబు పేల్చారా ?
X

టీడీపీ అధినేత చంద్రబాబు బాంబు లాంటి వార్తను చెప్పారు. టీడీపీ ప్రకటించిన 144 అసెంబ్లీ సీట్లు అలాగే 17 ఎంపీ సీట్లలో మార్పుచేర్పులు ఉంటాయని. దాంతో ప్రచారంలో ఉన్న అభ్యర్థుల గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎవరి సీటు ఎగిరిపోతుందో తెలియదు అంటున్నారు.

అయితే చంద్రబాబు చెప్పింది అందరికీ కాదు, ఆ భయం కూడా ఎవరూ పడనవసరం లేదని అంటున్నారు, కొద్ది పాటి మార్పులు మాత్రమే అని అంటున్నారు. అవి కూడా అవసరం అయిన చోట తప్పనిసరి అయితే చేస్తామని అంటున్నారు. అలా అనుకున్నా ఆ సీట్లు ఎన్ని ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అన్నది కూడా అభ్యర్థులను మధన పెట్టేదే.

ఏకపక్షంగా అభ్యర్ధుల మార్పులు ఉండదని మిత్రులతో చర్చిస్తామని అలాగే అందరితో మాట్లాడే మార్పు చేర్పులు ఉంటాయని చంద్రబాబు అంటున్నారు. దాంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి సీటులో ప్రకటించిన అభ్యర్ధి రామరాజు సీటు ఊడినట్లే అని అంటున్నారు. దాంతోనే ఆయన కంగారు పడుతున్నారు అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే ఉత్తరాంధ్రాలో ఒకటి రెండు సీట్లలో మార్పు తధ్యమని అంటున్నారు. అనకాపల్లి జిల్లాలో మాడుగుల సీటు విషయంలో మార్పు తధ్యమని అంటున్నారు. ఇక శ్రీకాకుళంలో రెండు సీట్ల విషయంలో తారస్థాయిలో తమ్ముళ్ల పోరు సాగుతోంది. ఆ సీట్ల విషయంలో మార్పులు ఉంటాయని అంటున్నారు.

అలాగే తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీటు విషయంలో సైతం మార్పు ఉండవచ్చు అని అంటున్నారు. అదే విధంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కురుపాం సీటులో ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్ధి వీక్ గా ఉన్నారని సర్వే నివేదికలు రావడంతో మారుస్తారు అని అంటున్నారు. ఈ విధంగా చూస్తే కనీసంగా అరడజన్ సీట్లలో మార్పు ఉంటాయా అన్న చర్చ సాగుతోంది.

అదే విధంగా ఏలూరు ఎంపీ సీటుతో పాటు మరికొన్ని చోట్ల కూడా మార్పులు ఉంటాయా అన్న చర్చ సాగుతోంది. అయితే ఈ మార్పుచేర్పులకు కనుక బాబు తెరతీసినట్లు అయితే అవి అక్కడితో ఆగుతాయా అన్నది ఒక సందేహంగా ముందుకు వస్తోంది. మిగిలిన చోట్ల ఆశావహులు అంతా తమ సీట్లో మార్పు చేయమని డిమాండ్లు పెడతారు అని అంటున్నారు. అది చివరికి చిరిగి చేట అయ్యే ప్రమాదం ఉంది అని అంటున్నారు

చూస్తూంటే మరో వారం రోజుల వ్యవధిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది. దానికి ముందు ఈ మార్పులు చేయడం మంచిదా కోరి కెలుక్కున్నట్లు అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా మార్పు చేర్పులు అన్నవి చివరి వరకూ చేస్తూ పోతూంటే దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి బాబు చేసే మార్పులు స్వల్పంగా ఉంటాయా లేక అవి ఏ స్థాయిలో ఉంటాయో అన్నది.