Begin typing your search above and press return to search.

నెల్లూరు టాక్స్: ఆనంకు లాలింపు... సోమిరెడ్డికి వాయింపు!

వివరాళ్లోకి వెళ్తే... ప్రస్తుతం "రా.. కదలిరా" అంటూ చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తూ, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Jan 2024 9:30 AM GMT
నెల్లూరు టాక్స్: ఆనంకు లాలింపు... సోమిరెడ్డికి వాయింపు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు అవలంభిస్తున్న పాతచింతకాయ పచ్చడి పద్ధతులతో మొదటికే మోసం వస్తుందనే చర్చ గత కొన్ని రోజులుగా రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికీ వేచి చూసే ధోరణి కొనసాగిస్తుండటంతో పార్టీలో అంతర్గతంగా రచ్చ తారాస్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. మరోపక్క పక్క పార్టీల నుంచి వచ్చిన నేతల పెత్తనంవల్ల దశాబ్ధాల నుంచి పార్టీలో ఉంటున్నవారు అసౌకర్యానికి గురవుతున్నారని తెలుస్తుంది.

అవును... ప్రస్తుతం నెల్లూరు జిల్లాల్లో టీడీపీ నేతల్లో అంతర్గత యుద్ధం జరుగుతుందని.. కేడర్ లో కన్ ఫ్యూజన్ నెలకొంటుందని.. నేతల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడుతుందని.. తామకే టిక్కెట్ అంటే తమకే టిక్కెట్ అంటూ నేతల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియా వేదికగా హీటెక్కుతుందని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆనం వర్సెస్ సోమిరెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చిందని.. దీంతో సోమిరెడ్డిని చంద్రబాబు గట్టిగా వాయించివదిలారని నెల్లూరు జిల్లాలో చర్చ నడుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... ప్రస్తుతం "రా.. కదలిరా" అంటూ చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తూ, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల వెంకటగిరి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ఈ సభకు వైసీపీ నుంచి బహిష్కరించబడి టీడీపీలో చేరిన ఆనం రాం నారాయణరెడ్డిని... సోమిరెడ్డి ఆహ్వానించలేదంట. దీంతో ఆనం అలకబూని ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా ఇంటివద్దే ఉన్నారు!

అయితే ఈ విషయంలో ఆలస్యంగా తెలుసుకున్న చంద్రబాబు... చివరి నిమిషంలో ఆ సభకు ఆనం ను ఆహ్వానించారంట. సరిగ్గా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో... కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు అడ్డుతగలడం కూడా జరిగింది. ఇలా దెబ్బ మీద దెబ్బ తగలడంతో... ఆనం తీవ్రంగా అలిగారని అంటున్నారు. దీంతో... ఆనం ను కోటంరెడ్డిని బస్సులోకి పిలిపించుకుని చంద్రబాబు బుజ్జగించారని అంటున్నారు.

ఈ సమయంలో ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... చంద్రబాబుపై కాస్త గట్టిగానే మాట్లాడారని తెలుస్తుంది. నమ్మి పార్టీలోకి వస్తే తమకు జరిగేది ఇదేనా అని వాపోయారని చెబుతున్నారు. అయితే... వీరి ప్రత్యర్థి వర్గం మాత్రం... నమ్మి రాలేదు – ఆప్షన్ లేక వచ్చారు అని కామెంట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఫైనల్ గా ఏదోలా... వీరిద్దరినీ చంద్రబాబు బుజ్జగించి పంపించారని అంటున్నారు.

సోమిరెడ్డికి బాబు వాయింపు!!:

ఈ సందర్భంగా ఆనం అలకకు, కోంటంరెడ్డి ఆగ్రహానికి కారకులయ్యారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర లపై బాబు ఫైర్ అయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితి ఏమిటి.. మీరు అనుసరిస్తున్న వైఖరి ఏమిటి అంటూ సీరియస్ అయ్యారని సమాచారం. దీంతో వీరిద్దరూ మౌనంగా ఉండిపోయారని అంటున్నారు.

ఇదే సమయంలో... కడప జిల్లాలో జరిగే సభకు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సోమిరెడ్డి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకోగా బాబు వారించారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు తన అవసరం లేదని బాబు అన్నారని.. దీంతో సోమిరెడ్డి హర్ట్ అయ్యారని లోకల్ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.