Begin typing your search above and press return to search.

బీజేపీకి కన్ను గీటుతున్న బాబు...!

ఇక తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం జెండాలు ఎలా కలగలిసిపోయి ఎగిరాయో అంతా చూశారు

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:32 PM GMT
బీజేపీకి కన్ను గీటుతున్న బాబు...!
X

చంద్రబాబుని అందుకే రాజకీయ చాణక్యుడు అనేది. ఆయన నిన్నటిదాకా కాంగ్రెస్ కి మద్దతు కోసమే తెలంగాణాలో పోటీకి తన పార్టీని పెట్టలేదని ప్రచారం ఒక వైపు పెద్ద ఎత్తున సాగింది. అది నిజం అన్నట్లుగా తెలంగాణా కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి లాంటి వారు అయితే చంద్రబాబుకు మీడియా ముఖంగానే ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ కి చంద్రబాబు మద్దతు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని కూడా అన్నారు.

ఇక తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం జెండాలు ఎలా కలగలిసిపోయి ఎగిరాయో అంతా చూశారు. ఖమ్మం లాంటి చోట్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కూడా టీడీపీకి థాంక్స్ చెప్పారు. దాని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీని విమర్శిస్తే దానికి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ వేశారు.

మేము డైరెక్ట్ గానే మద్దతు ఇస్తున్నామని వైసీపీ ఇండైరెక్ట్ గా బీయారెస్ కి మద్దతు ఇస్తోందా అని ప్రశ్నించారు కూడా. ఇలా టీడీపీ కాంగ్రెస్ ఒకటి అన్న ప్రచారం బాగా ఊపందుకున్న వేళ ఒకనాటి బాబు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణాకు కొత్త ముఖ్యమంత్రి అవుతారని అంతా భావిస్తున్న వేళ చంద్రబాబు స్టాండ్ కూడా మారుతుందని ఇండియా కూటమిలోకి టీడీపీ వచ్చి చేరుతుందని అంతా అంచనాలు కడుతున్న వేళ బాబు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పుట్టిన రోజు సందర్భంగా ఆయంకు ట్విట్టర్ వేదికగా బాబు శుభాకాంక్షలు తెలిపారు. "నడ్డా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలిగేలా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నా" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అరెస్ట్ తరువాత బాబు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు.

తన సొంత ఖాతాలో తిరుమల శ్రీవారి దర్శనం తరువాత ఫోటోలను గన్నవరం ఎయిర్ పోర్ట్ ర్యాలీ ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఇపుడు జేపీ నడ్డాకు ఆయన శుభాకాంక్షలు తెలియచేయడం ద్వారా బీజేపీ వెంటే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ నడుస్తోంది.

ఇక జనసేన ఈ రోజుకీ బీజేపీతో ఉంది. పవన్ కళ్యాణ్ తెలంగాణా ఎన్నికల్లో బీజేపీతో కలసి పొత్తు పెట్టుకున్నారు. పోటీ చేశారు. ఏపీలో కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారు కావచ్చు అని అంటున్నారు. పవన్ సైతం క్యాడర్ తో నిర్వహించిన సమావేశాలలో మాట్లాడుతూ వాజ్ పేయ్ నుంచి మోడీ అమిత్ షా జేపీ నడ్డాల ప్రస్తావన తెస్తున్నారు.

ఇక తెలంగాణా ఎన్నికల ఫలితాల తరువాత ఏపీ మీద ఫుల్ ఫోకస్ ని బీజేపీ పెడుతుందని అపుడు పొత్తుల మీద తన ఆలోచనలను పంచుకుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్ తరువాత ఆయన రాజకీయ ఎత్తులు వ్యూహాలు మారుతాయని అనుకున్న వారికి బాబు తాజా తీరు కొంత చర్చకు అయితే తావిస్తోంది. అయితే ఇదంతా మామూలే జస్ట్ విషెస్ అని కూడా అనుకోవచ్చు

కానీ బాబు ఏ పని చేసినా దాని వెనక వ్యూహాలు ఉంటాయని నమ్మే వారు మాత్రం బీజేపీ కన్ను గీటారనే అంటున్నారు. అసలే తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపు కోసం టీడీపీ పోటీ చేయకుండా తెర వెనక సహకరించింది అన్న దాని మీద బీజేపీ పెద్దలు గుస్సాగా ఉన్నారన్న దాని మీద ఇపుడు బాబు కూల్ కూల్ గా కంగ్రాట్స్ తో నీళ్ళు చల్లారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.