Begin typing your search above and press return to search.

గేర్ మార్చిన టీడీపీ...కొత్త బాబుని చూడబోతున్నారా...?

ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు కూడా సరికొత్తగా కనిపించాలని చూస్తున్నారు. కొత్తగా ఇమేజ్ కోసం యత్నిస్తున్నారు

By:  Tupaki Desk   |   2 Dec 2023 1:49 PM GMT
గేర్ మార్చిన టీడీపీ...కొత్త బాబుని చూడబోతున్నారా...?
X

చంద్రబాబు ఇపుడు కొత్తగా కనిపిస్తున్నారు. అరెస్ట్ కి ముందు తరువాత అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. చంద్రబాబుకి సరికొత్త ఇమేజ్ వచ్చిందా అంటే వచ్చింది అని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. బాబుని అక్రమంగా వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దాంతో చంద్రబాబుకు వెల్లువలా సానుభూతి వస్తుందని టీడీపీ ఊహిస్తోంది.

ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు కూడా సరికొత్తగా కనిపించాలని చూస్తున్నారు. కొత్తగా ఇమేజ్ కోసం యత్నిస్తున్నారు. అరెస్ట్ ముందు వరకూ మీడియా కనిపిస్తే ఎక్కువగా మాట్లాడే చంద్రబాబు ఇపుడు మాత్రం నెమ్మదిగా మాట్లాడుతున్నారు.

ఆయన జనాలలోకి ఎలా వెళ్లాలి అన్నది ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రజలలోకి వెళ్తే తనకు లభించే ఆదరణ ఎలా ఉంటుంది అన్నది కూడా అంచనా కట్టుకుని దాన్ని మరింతగా పెంచుకునే దిశగా ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ నేతలతో సమావేశమై వారికి సరైన దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో బాబు టీడీపీ ఎంపీలకు ఎలా వ్యవహరించాలో స్పష్టం చేశారని అంటున్నారు.

అంతే కాదు టీడీపీ ఎంపీలతో పాటు, టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుతో పార్టీ కార్యాచరణ ప్రణాళిక పై బాబు సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. ఇక చంద్రబాబు వంటి బిగ్ షాట్ ని అరెస్ట్ చేసి అర్ధ శతదినోత్సవంగా జైలు గోడల మధ్య ఉంచినందుకు దాన్ని ప్రజలలో గట్టిగా పంపించి వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేలా చేయాలని కూడా బాబు చూస్తునారు అని అంటున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో అధికార వైసీపీ పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని, అలాగే బాబు మీద సానుభూతి వెల్లువెత్తిన నేపథ్యం ఉందని టీడీపీ అంచనా కడుతోంది. దాంతో ఈసారి వైసీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు.

ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అరెస్టయిన తర్వాత రెగ్యులర్ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత బాబు తన ప్రచారాన్ని తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈసారి బాబు గేర్ మార్చి జోరు చేస్తారు అని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను పూర్తిగా స్టడీ చేసి వైసీపీ మీద వ్యతిరేక్త మరెంతలా పెరిగాలా చూస్తారని అంటున్నారు.

అదే విధంగా చూస్తే చంద్రబాబు సెప్టెంబరు 9న అరెస్టు కావడంతో ఆయన జనంలోకి వచ్చి దాదాపు 90 రోజులైంది. దంతో వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తూ త్వరలో ఎన్నికల ప్రచారాన్ని పున:ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

దాని కంటే ముందు చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అదే విధంగా విజయవాడలోని కనకదుర్గ దేవిని సైతం దర్శించుకున్నారు. ఇక ప్రజాసేవ చేసే శక్తి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు మీడియాకు ఈ సందర్భంగా చెప్పడం విశేషం.అలాగే తెలుగు రాష్ట్రం యావత్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు అంకితమై ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కృషి చేస్తానని బాబు చెబుతున్నారు.

అంటే ముందు దేవీ దేవతలకు ఆయన మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆయన ఆయన జనంలోకి వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద జగన్ మీద బిగ్ సౌండ్ చేస్తారు అని అంటున్నారు. ఇక చంద్రబాబు తిరుపతి విజయవాడలకు వచ్చినపుదు మంచి స్పందన లభించింది. దాంతో ఇక జనంలోకి వెళ్తే మరింత ఆదరణ దక్కుతుందని బాబు భావిస్తున్నారు. జనంలోకి చంద్రబాబు వెళ్తే వచ్చే జనాలే టీడీపీ భవిష్యత్తుకు సూచికలు అని అంటున్నారు. అదే విధంగా జనాలు రావడం వేరు ఓటేయడం వేరు. మరి ఈ రెండింటినీ ఒక్కటి చేస్తేనే టీడీపీకి విజయం దక్కుతుంది అని అంటున్నారు.