Begin typing your search above and press return to search.

గుళ్ళూ గోపురాల చుట్టూ బాబు...!

టీడీపీ అధినేత తన తొలి పర్యటన తొలి సభ మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన మౌన ముద్రలో ఉన్నారని అంటున్నారు

By:  Tupaki Desk   |   27 Nov 2023 5:51 PM GMT
గుళ్ళూ గోపురాల చుట్టూ బాబు...!
X

టీడీపీ అధినేత తన తొలి పర్యటన తొలి సభ మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన మౌన ముద్రలో ఉన్నారని అంటున్నారు. ఇదంతా వ్యూహాత్మకం అని అంటున్నారు. తాను జనంలోకి వస్తే ఆ ప్రభావం ఒక ప్రభంజనంలా ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అందుకే తన వ్యవహార శైలికి భిన్నగా మీడియా ముందుకు రాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. నిజానికి చూస్తే చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. ఆయన మీద ఉన్న అన్ని ఆంక్షలు లేకుండా పోయాయి. దాంతో బాబు ఎటైనా వెళ్లవచ్చు, ఏమైనా చేయవచ్చు.

కానీ ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశంగా మార్చుకోవాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు. మూడు నెలలకు పైగా జనంలో లేకుండా కనబడకుండా ఉన్న బాబు ఒక్కసారి ప్రజల మధ్యకు వస్తే ఆ ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠను పెంచాలని చూస్తున్నారు అంటున్నారు. అదే విధంగా ఈసారి తనకు ఈ రూపంలో వచ్చిన చాన్స్ ని పూర్తి స్థాయిలో వాడుకుంటే రానున్న మూడు నాలుగు నెలల ఎన్నికల దాకా ఇదే టెంపోని కంటిన్యూ చేస్తే అపుడు సులువుగా ఎన్నికల గోదారిలో టీడీపీ నావ అనుకున్న తీరం వైపుగా సాగుతుంది అని కూడా బాబు తలపోస్తున్నారు అని అంటున్నారు.

అందుకే చంద్రబాబు తన టూర్ గురించి ఒక ప్రణాళిక ప్రకారమే రచన చేస్తున్నట్లుగా ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు తన రాష్ట్ర పర్యటనలు రాజకీయాలు, సభల కంటే ముందు గుళ్ళూ గోపురాలు దేవీ దేవతల దర్శనాలను చేయనున్నారు. అలా ఆయన మొదట దేవుడికి మొక్కులు దండాలు చెల్లించుకుని ఆనక జనానికి తన దర్శనం ఇస్తారని అంటున్నారు.

అందులో భాగంగా ఈ నెల 30న చంద్రబాబు తిరుపతి పర్యటన పెట్టుకున్నారు. డిసెంబరు 1న శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. చంద్రబాబు డిసెంబరు 2న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం సింహాచలం క్షేత్రం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.

ఇలా చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్ర మొదట సాగుతుంది అని అంటున్నారు. ఆ మీదటనే ఆయన రాజకీయ యాత్ర ఉండబోతోంది. మొత్తానికి చూస్తే చంద్రబాబు కొన్ని రోజుల పాటు గుళ్ళూ గోపురాల చుట్టూనే పర్యటిస్తారు అని అంటున్నారు. ఇక డిసెంబర్ మొదటి రెండవ వారాల నుంచే ఆయన రాజకీయం బిజీ అవుతుంది అన్నది టీడీపీ వర్గాల మాట. చూడాలి మరి చంద్రబాబు రీబాక్ ఎలా ఉంటుందో. ఆయన వ్యూహాలకు జనాల నుంచి దక్కే రెస్పాన్స్ కి మధ్య సారూప్యం ఉంటుందా లేక వేరే ఏమైనా ఉంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.