Begin typing your search above and press return to search.

చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్రపై సుజనా క్లారిటీ!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:38 AM GMT
చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్రపై సుజనా క్లారిటీ!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. 25రోజులుగా చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నారు. ఇవాళ 26వ రోజు! ఆ సంగతి అలా ఉంటే... చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రంలోని పెద్దల హస్తం ఉందని, వారి మద్దతు లేనిదే ఈ పని జరిగేది కాదని రకరకాల కథనాలు వస్తున్నాయి.

అవును... మోడీ మద్దతు లేకుండా, అమిత్ షా అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్ట్ ఆల్ మోస్ట్ అసాధ్యం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అయ్యన్న పాత్రుడు వంటి టీడీపీ నేతలు సైతం... ఏపీలో ఏమి జరుగుతుందో ఢిల్లీలోని పెద్దలకు తెలియదా, వారికి తెలియకుండానే జరుగుతుందా అనే కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్రపై సుజనా చౌదరి స్పందించారు.

చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కేంద్రం ఆశీస్సులు లేవని సుజనా చౌదరి క్లారిటీ ఇచ్చారు. దేశంలో బీజేపీ అతి పెద్ద పార్టీ అని, ఏపీలో బీజేపీకి నష్టం జరుగుతోందన్న ఆవేదన తమకూ ఉందని సుజనా చౌదరి తెలిపారు.

ఇదే సమయంలో బీజేపీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత ఆగ్రహంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సుజనా చౌదరి... చంద్రబాబు కేసు కోర్టులో విచారణలో ఉండటం వల్ల ఎక్కువగా స్పందించడం లేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... రాష్ట్ర ప్రభుత్వంలో సీఐడీ ఒక భాగం అని స్పష్టం చేశారు.

అనంతరం చంద్రబాబుకు కాస్త సపోర్ట్ గా, జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేసిన సుజనా చౌదరి... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఇదే క్రమంలో... ఏపీలో జరుగుతోన్న వాటితో బీజేపీకి సంబంధం లేదని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో... మాట్లాడుతున్న వివిధ వర్గాల అభిప్రాయాల ప్రకారం, ఈసారి రాష్ట్రంలో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పడం గమనార్హం. ఇక, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక పక్క వైసీపీ ఉంటే.. మరో పక్క టీడీపీ - జనసేన ఉన్నాయని, మిగిలిన పార్టీలు పెద్దగా ప్రభావితం చేయగలిగే పరిస్థితుల్లో లేవని బీజేపీ నేత సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.