Begin typing your search above and press return to search.

జైల్లో చంద్రబాబు టైం పాస్ ఇదే....!

కానీ అదిగో ఇదిగో అంటూ ఏకంగా 22 రోజులు పై దాటింది రిమాండ్ ఖైదీగా బాబు జీవితం. ఇక బాబు కేసు విషయంలో ఏదైనా తేలాల్సింద్ అక్టోబర్ 3న సుప్రీం కోర్టులోనే

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:09 AM GMT
జైల్లో చంద్రబాబు టైం పాస్ ఇదే....!
X

చూస్తూండగానే టీడీపీ అధినేత చంద్రబాబు జైలు జీవితం 22 రోజులు పూర్తి అయిపోయింది. సెప్టెంబర్ 10న అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆయనతో పాటు అంతా కూడా ఆయన రేపో మాపో బయటకు వచ్చేస్తారు అనే అనుకున్నారు.

కానీ అదిగో ఇదిగో అంటూ ఏకంగా 22 రోజులు పై దాటింది రిమాండ్ ఖైదీగా బాబు జీవితం. ఇక బాబు కేసు విషయంలో ఏదైనా తేలాల్సింద్ అక్టోబర్ 3న సుప్రీం కోర్టులోనే. దాని మీదనే కోటి ఆశలతో టీడీపీ ఉంది. ఇక జైలులో చంద్రబాబు ఏమి చేస్తున్నారు ఎలా ఉన్నారు అన్నది అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు ఎపుడూ ఖాళీగా లేరు. ఆయన సీఎం గా అయినా మాజీ సీఎం గా అయినా కూడా ఫుల్ బిజీగా ఆయన దినచర్య మొదలవుతుంది. అర్ధరాత్రి దాకా రివ్యూస్ తోనో లేక టూర్లు సభలతోనో సాగుతుంది.

అలాంటి బాబు ఫుల్ ఫ్రీగా ఏమీ కాకుండా జైలు నాలుగు గోడల మధ్యన ఉంటే ఎలా గడుపుతారు అన్నది ఆయనతో పాటు బాబు గురించి తెలిసిన వారందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే చంద్రబాబు జైలు జీవితం చూస్తే ఉదయాన్నే ఆయన న్యూస్ పేపర్లను పూర్తిగా చదువుతారు అని అంటున్నారు. అలాగే ఆయన టీవీలో కూడా రెగ్యులర్ న్యూస్ ఎక్కడా మిస్ కాకుండా చూస్తున్నారు. అలా బాబుకు ఏపీలో ఏమి జరుగుతోంది దేశంలో ఏమి జరుగుతోంది అన్నది పూర్తిగా అవగాహన ఉంది.

దాని ప్రకారమే ఆయన తనదైన వ్యూహాలను జైలు గోడల మధ్యనే రూపొందించుకుని మరీ తంతో ములాఖత్ కి వస్తున్న పార్టీ నేతలకు, కుటుంబ సభ్యులకు కూడా తెలియచేస్తూ ఉంటారని, వారి ద్వారా టీడీపీకి ఆయన దిశా నిర్దేశం చేస్తూ నడిపిస్తున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుకు వేడి నీళ్ళ స్నానాన్ని జైలు అధికారులు ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆయనకు ఇంటి నుంచి భోజనం సకాలంలో అందుతుంది. అదే విధంగా ఆయనకు అవసరం అయిన మందులు కూడా వస్తూంటాయి.

ఇక వైద్య సదుపాయం ఆయనకు ఎప్పుడూ ఉంటుంది. అంతే కాదు బాబుకు పూర్తి స్థాయిలో భద్రత కూడా జైలు అధికారులు అందిస్తున్నారు. మొత్తానికి బాబు జైలు జీవితం మూడు వారాలు పూర్తి చేసుకుని నెల రోజుల వైపుగా పరుగులు తీస్తోంది. మరి బాబు కేసు ఏమవుతుంది. ఆయన బయటకు ఎపుడు వస్తారు అంటే దాని గురించి అంతా ప్రస్తుతానికి సుప్రీం కోర్టు వైపు చూడాల్సిందే.