Begin typing your search above and press return to search.

మానసికంగా కృంగిపోయాను... చంద్రబాబు !

అయితే బాబు చెప్పిన విషయాలు విన్న ఏసీబీ న్యాయమూర్తి ప్రస్తుతం జరుగుతోంది కేవలం కోర్టు ప్రొసీజర్ మాత్రమే అన్నారు

By:  Tupaki Desk   |   22 Sep 2023 8:08 AM GMT
మానసికంగా కృంగిపోయాను...   చంద్రబాబు !
X

చంద్రబాబు అంటే డేరింగ్ డేషింగ్ అని అంతా అంటారు. ఆయన కూడా పదే పదే అదే మాటను అంటూ ఉంటారు. తాను సవాళ్ళూ సంక్షోభాల గురించి ఎపుడూ ఆలోచించను భయపడను, వాటిని అవకాశాలుగా మార్చుకుంటాను అని బాబు తరచూ చెబుతూ ఉంటారు. అలాంటి బాబు నోటి వెంట వచ్చిన మాటలు అది కూడా జైలు గోడల మధ్య పది రోజుల పాటు నలిగిన తరువాత వచ్చిన మాటలు ఏంటి అంటే నేను మానసికంగా కృంగిపోయాను అని.

బాబుతో శుక్రవారం ఉదయం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన విచారణ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు రిమాండ్ ని ఈ నెల 24 వరకూ పొడిగించారు. ఇక ఈ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వరా విచారణకు హాజరైన చంద్రబాబు తనకు ఈ కేసులో ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు.

అదే విధంగా తన మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించారు అని అన్నారు. తాను మానసికంగా కృంగిపోయానని న్యాయమూర్తిని ఆయన చెప్పుకున్నట్లు తెలిసింది. అదే విధంగా ఆరోగ్యరీత్యా కూడా తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పారు తనకు జైలులో ఏసీ లేదని, దోమలు కుడుతున్నాయని బాబు జైలు ఇబ్బందుల గురించి కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది

అయితే బాబు చెప్పిన విషయాలు విన్న ఏసీబీ న్యాయమూర్తి ప్రస్తుతం జరుగుతోంది కేవలం కోర్టు ప్రొసీజర్ మాత్రమే అన్నారు. బాబు మీద ఆరోపణలు వచ్చాయని అవి నిరూపితం కాలేదని కూడా అన్నారు. ట్రయల్ ఇంకా జరగలేదని అన్నారు. బాబు ని రిలాక్స్ గా ఉండమని సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే ఇది రిమాండ్ మాత్రమేనని నేరం చేసినట్లు ఇంకా రుజువు కాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే జైలులో బాబు ధైర్యంగా ఉన్నారు . ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అని యనమల రామక్రిష్ణుడి నుంచి ములాఖత్ ద్వారా కలసిన బాలయ్య వరకూ చెప్పుకొచ్చారు. దానికి భిన్నగా చంద్రబాబు అయితే తాను బాగా కృంగిపోయాను అని చెప్పడం విస్మయం గానే ఉంది అంటున్నారు.

ఏది ఏమైనా జైలు గోడల వెనక ఎవరు ఉన్నా అలాగే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో బాబు గురితించి చేసిన కామెంట్స్ కూడా గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు గారు ఎంతమంది సీజేలను చూశారు కానీ ఆయన ఇపుడు రాజమండ్రి సీజేను చూస్తున్నారు అని కామెంట్స్ చేశారు. సీజేలు అంటే చీఫ్ జస్టిస్ లు అని ఒక అర్ధం అయితే సీజే అంటే సెంట్రల్ జైలు అని మరో అర్ధం వచ్చేలా ఆయన చెప్పారు.

టైం అండి టైం అంటూ అదే కన్న బాబు అన్నారు. టైం ఎపుడూ ఒకేలా ఉండదు కదా అందుకే విజనరీ చంద్రబాబు ఇపుడు ప్రిజనరీ అయిపోయారు అని కన్నబాబు కామెంట్స్ చేశారు. ఆయన అన్నారని కూదు కానీ కాలం కలసిరాకపోతే బాబు లాంటి వారు అయినా జైలు గోడల వెనక తప్పదన్నది మరోసారు రుజువైన సత్యం అంటున్నారు.