Begin typing your search above and press return to search.

ఊరించిన హామీ వదిలిసిన బాబు...ఓట్ల పంటేనా...!?

ఏపీవ్యాప్తంగా అందరికీఉచిత ఇసుక ఇస్తామని కూదా చంద్రబాబు మరో హామీ ఇచ్చారు. సిక్కోలు సభలో బాబు ఈ హామీల జల్లు కురిపించారు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 3:34 PM GMT
ఊరించిన హామీ వదిలిసిన బాబు...ఓట్ల పంటేనా...!?
X

చంద్రబాబు ఈ హామీ ఇస్తారని విపరీతంగా ప్రచారం సాగింది. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ హామీ కూడా ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేసింది అని కూడా అంతా చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే అమలు చేసిన తొలి హామీ ఇది. దానికి వచ్చిన స్పందన కూడా అద్భుతంగా ఉంది. సో ఈ హామీ టీడీపీ వదులుతుందని అంతా అనుకున్నారు.

అనుకున్నట్లే ఈ హామీని బాబు తన అమ్ముల పొది నుంచి విడిచిపెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రాలోని సిక్కోలు జిల్లాలో బాబు ఈ హామీ ఇచ్చారు. అదే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పిస్తాం అని బాబు ఆర్భాటంగా ప్రకటించారు.

మరి ఇది మహిళల కోసమా లేక అందరి కోసమా అన్నది చెప్పలేదు. అదే టైం లో సూపర్ సిక్స్ లోని హామీలను కూడా మరోమారు వల్లించారు. ఒక ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎంత మంది ఉన్నా వారికి 20 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే ఏపీలోని రైతులకు మొత్తంగా ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. ఇక . రైతును రాజును చేస్తామన్, అదే విధంగా బీసీ డిక్లరేషన్‌ ఇస్తామని బాబు ప్రకటించారు.

ఏపీవ్యాప్తంగా అందరికీఉచిత ఇసుక ఇస్తామని కూదా చంద్రబాబు మరో హామీ ఇచ్చారు. సిక్కోలు సభలో బాబు ఈ హామీల జల్లు కురిపించారు. మరి ఇందులో కొత్త హామీ మాత్రం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణమే. ఈ హామీ ఇచ్చిన తరువాత తెలంగాణాలో మంచి ఉంది, చెడూ ఉంది. ఆటో డ్రైవర్లు అంతా తమకు బతుకు పోయిందని ఆందోళనలు చేస్తున్నారు. వారికి ఇప్పటికి ఆల్టర్నేషన్ అయితే అక్కడ ప్రభుత్వం చూపించలేకపోతోంది.

అదే విధంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పురుషులకు బస్సులు లెక్కడమే అతి పెద్ద సమస్యగా మారింది. వారి కోసం ఏమి చేయాలన్నది కూడా ఇంకా ప్రభుత్వం తేల్చలేదు ఆర్టీసీ నష్టాలు ఎంత అన్నది కూడా ఒక అంచనాంకు రాలేదు. ప్రస్తుతానికి ఆ పధకం అయితే అక్కడ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.

మరి ఏపీలో చూస్తే ఆర్టీసీ నష్టాలలో ఉంది. పైగా ఈ పధకం వల్ల ఆటో కార్మికుల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. ఏది ఏమైనా టీడీపీకి ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. అందుకే ఈ బ్రహ్మాండమైన హామీని కూడా వదిలారు అని అంటున్నారు.