Begin typing your search above and press return to search.

చంద్రబాబు స్టామినా ఇంతనా? కుర్రాడిలా చెలరేగిపోతున్నారట

74 ఏళ్ల వయసులో చంద్రబాబు చూపిస్తున్న ఉత్సాహం చూసినోళ్లు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీ అధినేతలంతా ఆయనకంటే చిన్నవారు.

By:  Tupaki Desk   |   28 April 2024 10:00 PM IST
చంద్రబాబు స్టామినా ఇంతనా? కుర్రాడిలా చెలరేగిపోతున్నారట
X

ఏపీలో జరుగుతున్న ఎన్నికల వేళ పార్టీలకు అతీతంగా ఒక అంశంపై నేతలంతా ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ఏపీ అసెంబ్లీకి.. ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారు జోరు ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ ప్రచారాల్లో ఎవరి మాటలు వారివి. ఎవరి లెక్కలు వారివి. అయితే.. వీటన్నింటికి భిన్నంగా ఒక విషయం మాత్రం హైలెట్ గా మారింది. ఏపీ ఎన్నికల బరిలో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే.. వీరందరిలోనూ వయసులో పెద్దోడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు. మిగిలిన ఏపీ అధినేతలు.. నేతలతో పోలిస్తే ఉత్సాహంగా పర్యటిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు ఆయన రాజకీయప్రత్యర్థుల్ని ఆయన్ను ముసలోడిగా తీసిపారేయటం.. ఆయన్ను ఎటకారం చేయటం కనిపించేది. కానీ.. ఎన్నికలకు కాస్త ముందు.. ఎన్నికలు జరుగుతున్న తాజా పరిస్థితుల్లో చంద్రబాబు స్టామినాను చూసిన ఆయన ప్రత్యర్థులు సైతం అవాక్కు అవుతున్నారు.

74 ఏళ్ల వయసులో చంద్రబాబు చూపిస్తున్న ఉత్సాహం చూసినోళ్లు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీ అధినేతలంతా ఆయనకంటే చిన్నవారు. ఏపీ విషయానికి వస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 55ఏళ్లు కాగా.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 51 ఏళ్లు. అంటే.. చంద్రబాబు కంటే ఈ ఇద్దరు అధినేతల వయసు దాదాపు 20 ఏళ్లు పైనే.

వయసులో ఇంత తేడా ఉన్నప్పుడు ఉత్సాహం విషయంలో వీరిద్దరితో పోటీ పడటమే కాదు.. తనతో పోటీ పడే సత్తా ఎవరికీ లేదన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఉదయం పూట ప్రచారం చేయటానికి యువకులైన నేతలు సైతం చెమటలు కక్కుతూ.. సాయంత్రం వేళకు ప్రచారాల్ని వాయిదా వేస్తున్నారు.తెలంగాణరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. తన బస్సు యాత్రను సాయంత్రం వేళలోనే నిర్వహిస్తున్నారు.

అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రచారం మాత్రం పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఆయన ప్రదర్శిస్తున్న స్టామినాను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. 74 ఏళ్ల వయసులో ఇంతలా శ్రమించటం ఆయనకుమాత్రమే సాధ్యమంటున్నారు. రాజకీయంగా సవాలచ్చ విభేదాలు ఉండొచ్చు కానీ ఇంతటి బలం ఆయనకు మాత్రమే సాధ్యమంటున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. చంద్రబాబు ఫిట్ నెస్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోందని మాత్రం చెప్పక తప్పదు.