Begin typing your search above and press return to search.

థాంక్యూ జగన్... ఇట్లు మీ సీనియర్ ఎన్టీఆర్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబడ్డ సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Sep 2023 6:11 AM GMT
థాంక్యూ  జగన్... ఇట్లు మీ సీనియర్ ఎన్టీఆర్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబడ్డ సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకూ చంద్రబాబు ఇంటినుంచి పంపించే భోజనం తింటూ, టై ప్రకారం మెడిసిన్స్ వేసుకుంటూ జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో జగన్ కు సీనియర్ ఎన్టీఆర్ థాంక్స్ చెబుతున్నట్లుగా ఉన్న ఫ్లెక్స్ వైరల్ గా మారింది.

అవును... చంద్రబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆత్మ సంతోషిస్తుందంటూ పలువురు నేతలు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో "థాంక్యూ జగన్... నా ఆత్మకు శాంతి చేకూర్చావు" అంటూ సీనియర్ ఎన్టీఆర్ చెబుతున్నట్లు ఒక ఫ్లెక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జూనియర్ అభిమానులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్న ఒక ఫ్లెక్స్ వైరల్ గా మారింది. ఇందులో జగన్ కు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ లు పుష్పగుచ్చం ఇస్తున్నట్లు ఫోటో ఉంది.

"నన్ను చివరి దశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురిచేసి, నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకుని నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా వీడి కుటిల రాజకీయాలకు వాడుకుని, చివరకు నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచరాజకీయానికి వాడుకున్న నీచుడికి బుద్ది చెప్పి నా ఆత్మకు శాంతిని చేకూర్చావు"

"నీచుడూ, దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబరు 10న జైలుకు వెళ్తున్న సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజును (సెప్టెంబర్ 10) ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి... ఇట్లు... నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)" అని ఆ ఫ్లెక్స్ లో మేటర్ రాసి ఉంది! దీంతో ఈ ఫ్లెక్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.