Begin typing your search above and press return to search.

పోలవరం అమరావతి బాబు కట్టేశారా... ?

ఇక అమరావతి రాజధాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అని అంటున్నారు. అమరావతి రాజధాని కోసం భూములను సేకరించడం దాకా అయితే సాగింది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:34 PM GMT
పోలవరం అమరావతి బాబు కట్టేశారా... ?
X

నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జనంలోకి వెళ్తున్నారు. ఆమె తన భర్తను అక్రమంగా జైలులో పెట్టారని ప్రజలతో చెప్పుకుని బాధపడుతున్నారు. అయితే ఆమె మూడవ రోజు స్పీచ్ లో రాజకీయం మరింత రాటుతేలేలా కనిపించింది. బాబు ఏపీకి ఎంతో చేస్తే ఆయన్ని జైలులో పెడతారా అంటూ భువనేశ్వరి నిలదీస్తున్నారు. బాబు చేసిన తప్పేంటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు పోలవరం కట్టడం తప్పా. అమరావతి రాజధాని నిర్మించడం పాపమా అని ఆమె ప్రజల సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమె చెప్పిన దాని మీదనే విస్మయం వ్యక్తం అవుతోంది. పోలవరం ఈ రోజుకీ నిర్మాణం పూర్తి కాక పడకేసి ఉంది. టీడీపీ వారే చెబుతారు మేము డెబ్బై శాతం మాత్రమే పూర్తి చేశామని, అది కూడా కొంత నిర్మాణం వరకూ అయితే అసలు కధ పునరావాసం జోలికి పోలేదు. అది పూర్తి అయితేనే తప్ప పోలవరం పూర్తి అయినట్లు కాదు.

పునరావాసం అంటే వేలాది కోట్ల నిధులతో ఆధారపడి ఉంది. అందుకే కేంద్రం వైపు చూడాల్సి వస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ని ఏటీఎం లా బాబు చూస్తున్నారని అవినీతి జరుగుతోందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల వేళ ఏలూరు సభ సాక్షిగా చెప్పారు.

ఇక అమరావతి రాజధాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అని అంటున్నారు. అమరావతి రాజధాని కోసం భూములను సేకరించడం దాకా అయితే సాగింది. శిలాఫలకం వేసారు. నవ నగరాల నిర్మాణం కోసం డిజైన్లు ఎంపిక చేసే పనిలోనే పుణ్యకాలం కాస్తా పూర్తి అయింది. అందుకే జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ముందుకు రావడానికి ఆస్కారం ఏర్పడింది.

అమరావతి రాజధానిని తక్కువ బడ్జెట్ తో తక్కువ అంచనాలు పెట్టుకుని పూర్తి చేసి ఉంటే జగన్ కాదు మరెవరు అయినా దాన్ని కదిలించే పని చేసేవారు కాదనేది మేధావులతో సహా అంతా అనే మాట. విషయం ఇలా ఉంటే బాబు పోలవరం, అమరావతి కట్టారని భువనేశ్వరి చెప్పడం మీద వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి.

భువనేశ్వరికి రాజకీయాలు తెలియవు, అందుకే ఆమె ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదువుతున్నారని, ఈ కారణంగానే ఏపీలో అన్నీ పూర్తి అయ్యాయని ఆమె అనుకుంటున్నారు అని అంటున్నారు. ఇక ఆమె ఉండేది హైదారాబాద్ కాబట్టి ఏపీలో ఏమి జరుగుతున్నాయన్నది తెలియకపోవచ్చు అని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

ఇక చంద్రబాబు చేసిన నేరం ఏమిటి అని దాదాపుగా ప్రతీ సభలో ఆమె అడుగుతున్నారు. బాబు ఏ నేరం చేయకపోతే న్యాయస్థానాలు రిమాండ్ విధించవు కదా ఈ చిన్న లాజిక్ మిస్ అయిన నారా భువనేశ్వరి జనం వద్దకు వచ్చి మాట్లాడితే ఎలా అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఇక చంద్రబాబు కేసు విషయంలో అవగాహన ఉన్న వారు అయితే భార్యగా ఆమె తన భర్త ఏ తప్పూ చేయలేదని భావించడం సహజమే అని ఆ విధంగా ఆమె మాట్లాడుతున్నారు అని అంటున్నారు.

అయితే ప్రజలకు అన్ని విషయాలూ సోషల్ మీడియా యుగంలో బాగా తెలిసి వస్తున్నాయని అందుకే జనంలో ఆశించిన రియాక్షన్ లేదని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్క మాట ఇక్కడ చూడాలి. భువనేశ్వరి చెప్పినట్లుగానే అమరావతి రాజధాని పోలవరం బాబు కట్టి ఉంటే ఆయన 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారు అన్నది.

ఈ రెండూ ఏపీకి అత్యంత ముఖ్యం, జీవనాడి వంటి పధకాలు. వాటిని నీరు కార్చి గ్రాఫిక్స్ లతో కాలక్షేపం చేయడం వల్లనే బాబు ఓటమి పాలు అయ్యారని ఈ విషయం నాలుగున్నరేళ్ళు అయినా టీడీపీ వారికి అర్ధమైనా వారు చెప్పాల్సింది చెబుతూ రాజకీయం చేస్తూ ఉంటారని అంటున్నారు. మరి భువనేశ్వరి అయినా నిజాలు మాట్లాడాలి కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. నిజం గెలవాలీ అంటే అసత్యాలు చెప్పడం కాదు కదా అనీ అంటున్నారు.