చంద్రబాబు.. సంపద పెంపు ఫార్ములా ఇదే!
ఏపీ సీఎం చంద్రబాబు సంపద పెంపుపై దృష్టి పెట్టారు. ఒకవైపు సంపద సృష్టిస్తూనే.. మరోవైపు దీనిని పెంచే మార్గాలపై ఆయన పక్కా ప్లాన్‌తో ముందుకు సాగాలని నిర్ణయించారు
By: Tupaki Desk | 10 April 2025 2:53 AMఏపీ సీఎం చంద్రబాబు సంపద పెంపుపై దృష్టి పెట్టారు. ఒకవైపు సంపద సృష్టిస్తూనే.. మరోవైపు దీనిని పెంచే మార్గాలపై ఆయన పక్కా ప్లాన్‌తో ముందుకు సాగాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మూడు మార్గాల ద్వారా సంపద పెంపుపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించా రు. ప్రస్తుతం వస్తున్న పన్ను ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు. ఇంటి పన్నులు, నీటి పన్నుల రాబడిని పెంచడం తో పాటు దీర్ఘకాలిక బకాయిలను వసూలు చేయాలని తెలిపారు.
ఇక, రెండో మార్గంగా.. రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని మరింత పెంచాలని చంద్రబాబు సూచించారు. గత అక్టోబరులో రిజిస్ట్రేషన్ల ధరలను పెంచిన నేపథ్యంలో ఆదాయం తగ్గడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుని.. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని తెలిపా రు. వాణిజ్య ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా.. రాబడి పెంచాలని సూచించారు.
అలానే.. వాణిజ్య పన్నులు, సుంకాల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎగవేత లను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించవద్దని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే.. ఏఐ సాంకేతికతను వినియోగించుకునే ప్రక్రియ కు శ్రీకారం చుట్టాలని సూచించారు. అదేవిధంగా నిరంతరం తనిఖీలు చేపట్టడం ద్వారా.. పన్నుల వసూళ్లను పెంచాలని.. తెలిపా రు. అదేవిధంగా మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వృద్ధి 2.2 పెరిగిందని.. దీనిని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని అధికారులకు వివరించారు. అందరూ యుద్ధ ప్రాతపదికిన సంపద పెంపుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.