బాబు పదే పదే వైసీపీ టార్గెట్ ఎందుకు... ఆ రెండే కారణమా...?
కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి నాయకులు అడుగులు వేయాలన్నది చంద్రబాబు చెబుతున్న మాట.
By: Garuda Media | 28 April 2026 8:30 AM ISTఎక్కడికి అక్కడ వైసీపీని ఎండగట్టండి. ప్రజల్లో ఉండండి. అదేవిధంగా వైసీపీ చేస్తున్న అరాచకాలను చేసిన అరాచకాలను కూడా ప్రజలకు వివరించండి. అంటూ టిడిపి అధినేత చంద్రబాబు పదేపదే కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఎక్కడ మైకు పట్టుకున్న ఆయన ఇదే మాట చెబుతున్నారు. నిజానికి 11 స్థానాలు ఉన్న వైసిపి గురించి ఈ రేంజ్ లో మాట్లాడ్డం అనేది రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.
దీనిపై అనేకమంది పరిశీలకులు కూడా చంద్రబాబు ఎందుకు పదేపదే వైసిపి గురించి మాట్లాడుతారు.. ప్రజలే మరిచిపోయిన పార్టీని ప్రజలే వద్దనుకున్న పార్టీని ఆయన ఎందుకు జాకీలు పెట్టి పైకి లేపాలి అని భావిస్తారు అనే చర్చ కూడా నడుస్తుంది. అయినా చంద్రబాబు మాత్రం దీన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లాలని పార్టీ తరఫునే కాదు.. వైసిపి తరఫున బలమైన గళం వినిపించాలని కూడా ఆయన నేతలకు చెబుతున్నారు దీనికి రీజన్స్ ఏంటి అసలు ఎందుకు చంద్రబాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే... ప్రధానంగా గత ఎన్నికల్లో కూటమి గెలుపు వెనుక బలంగా పనిచేసిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి జగన్ పై వ్యతిరేకత. రెండు.. కూటమిపై నమ్మకం. ఈ రెండు అంశాలే గత ఎన్నికల్లో కూటమిని గెలిపించాయి.
ఇప్పుడు అదే జగన్‌కు వ్యతిరేకత స్థానంలో సింపతి పెరిగినా.. కూటమిలో అంతర్గత విభేదాలు మరింతగా రాజుకున్నా.. మొత్తానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనిని బట్టి కూటమిని సఖ్యతగా ఉంచడంతోపాటు జగన్ వ్యతిరేకతను తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే చంద్రబాబు పదేపదే వైసీపీని ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు కారణాలను అర్థం చేసుకోవడంలో కూటమి కనక విఫలమైతే అది మొత్తానికే మోసం చేసే పరిస్థితి ఉంటుంది.
కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి నాయకులు అడుగులు వేయాలన్నది చంద్రబాబు చెబుతున్న మాట. పాదయాత్ర ద్వారా జగన్ సంపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు అన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇక ఇదే సమయంలో కూటమి నాయకులు సఖ్యతగా లేకపోతే కూటమిపై ఉన్న నమ్మకం తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే నాయకులను కలివిడిగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రజల్లోకి వెళ్లాలని చెప్తున్నారు. తద్వారా వైసిపి కి ఛాన్స్ ఇవ్వకుండా అడ్డుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ. మరి దీన్ని సఫలం చేసే బాధ్యత కార్యకర్తలు, నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది సీనియర్లు గ్రహించాలి.
