Begin typing your search above and press return to search.

టీడీపీ టార్గెట్‌.. ఎమ్మెల్యేల‌కు చుక్క‌లే.. !

టీడీపీ ఎమ్మెల్యేలు .. 134 మంది ఉన్నారు. గ‌తానికి భిన్నంగా పార్టీ అత్య‌ధిక సంఖ్య‌లో 2024లో ఇన్ని స్థానాలు ద‌క్కించుకుంది.

By:  Garuda Media   |   30 March 2026 4:00 PM IST
టీడీపీ టార్గెట్‌.. ఎమ్మెల్యేల‌కు చుక్క‌లే.. !
X

టీడీపీ ఎమ్మెల్యేలు .. 134 మంది ఉన్నారు. గ‌తానికి భిన్నంగా పార్టీ అత్య‌ధిక సంఖ్య‌లో 2024లో ఇన్ని స్థానాలు ద‌క్కించుకుంది. పార్టీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి లెక్క‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ఈ రేంజ్‌లో పార్టీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఇదే తొలిసారి. అయితే.. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు.. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స‌ద‌రు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కానీ.. ఈ విష‌యంలోనే టీడీపీ కీల‌క నిర్ణ యం తీసుకుంది.

వ‌చ్చే ఎన్నిక‌ల కంటే కూడా.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను పార్టీ కీల‌కంగా భావిస్తోంది . దీనిలో రెండు ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

1) కూట‌మి అధికారంలో ఉంది. పైగా.. సూప‌ర్ సిక్స్‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో నెల నెలా 1నే పింఛ‌న్లు అందిస్తున్నారు. మ‌రోవై పు పెట్టుబ‌డులు తీసుకువ‌స్తున్నారు. దీంతో స్థానిక ఎన్నిక‌ల్లో వీటి ప్ర‌భావం క‌నిపించాల‌ని.. గెలుపు గుర్రం ఎక్కాల‌ని టీడీపీ భావిస్తోంది.

2) లెక్కకు మిక్కిలిగా ఎమ్మెల్యేలు: గ‌తంతోపోలిస్తే.. ప్ర‌స్తుతం పార్టీకి లెక్కకు మిక్కిలిగా ఎమ్మెల్యేలు ఉ న్నారు. సో.. ప్ర‌తి జిల్లాలోనూ వారి ప్ర‌భావం ఉంది. కాబ‌ట్టి వీరి స‌త్తా.. ఖ‌చ్చితంగా స్థానిక ఎన్నిక‌ల్లో క‌నిపిం చాల‌ని స‌ర్కారు అంచ‌నా వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఎమ్మెల్యేల‌కు సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా టార్గెట్లు పెట్టారు. అంతేకాదు.. హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వా సృష్టించాల‌ని తేల్చి చెప్పారు.

అంతేకాదు.. ఒక‌వేళ ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ప్ర‌త్య‌ర్థులు పుంజుకున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో `సీటు`కు వేరే వారిని చూసుకుంటామ‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప్ర‌స్తుతం .. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థ లు, కార్పొరేష‌న్ల‌లో వైసీపీ బ‌లం ఎక్కువ‌గా ఉంది. కానీ, ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న నేప‌థ్యంలో పైగా టీడీపీ సంఖ్యా బ‌లం ఎక్కువ‌గా ఉన్న క్ర‌మంలో ఆమేర‌కు మార్పులు క‌నిపించాల‌ని.. స్తానికంలో టీడీపీ స‌హా కూట‌మి పార్టీల జెండాలు రెప‌రెప‌లాడాల‌ని పార్టీ ల‌క్ష్యంగా విధించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.