Begin typing your search above and press return to search.

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఇద్దరి మధ్య నవ్వులే నవ్వులు!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై తళుక్కుమన్నారు. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరూ కలవడమే కాకుండా పక్కపక్కనే కూర్చొని నవ్వులు పంచుకోవడం ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   16 Nov 2025 11:53 PM IST
ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఇద్దరి మధ్య నవ్వులే నవ్వులు!
X

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై తళుక్కుమన్నారు. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరూ కలవడమే కాకుండా పక్కపక్కనే కూర్చొని నవ్వులు పంచుకోవడం ఆకర్షించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకున్నారు? ఎందుకంతలా నవ్వుతున్నారనేది ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనాడు గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్ లెన్స్’ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం హైదరాబాదులో జరిగింది.

రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అతిరథ మహారథులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ గవర్నర్ దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు. వేదికపై ఎందరో ప్రముఖులు ఉన్నా, అందరూ గురుశిష్యలైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోష్ మీద కనిపించిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన భుజం తట్టి ప్రశంసించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అంతేకాకుండా తన పక్కనే కూర్చొబెట్టుకుని పిచ్చాపాటి మాటలతో ఇద్దరు హాయిగా నవ్వుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక రామోజీరావు జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలు అంతా ఆయన గొప్పతనాన్ని శ్లాఘించారు.