Begin typing your search above and press return to search.

అందుకే ఎన్టీఆర్ కేబినెట్ రద్దు చేశారు... మంత్రులకు బాబు క్లాస్

ఇప్పటికి దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం 1988లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒక్క కలం పోటుతో టోటల్ కేబినెట్ ని రద్దు చేశారు.

By:  Satya P   |   11 April 2026 8:30 AM IST
అందుకే ఎన్టీఆర్ కేబినెట్ రద్దు చేశారు... మంత్రులకు బాబు క్లాస్
X

ఇప్పటికి దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం 1988లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒక్క కలం పోటుతో టోటల్ కేబినెట్ ని రద్దు చేశారు. దాదాపుగా 45 మందికి పైగా ఉన్న మంత్రులు అంతా ఈ దెబ్బకు మాజీలు అయిపోయారు. ఆ తరువాత వారి స్థానంలో కొత్త వారిని ఎన్టీఆర్ తీసుకున్నారు. సీనియర్లు అంతా పక్కకు వెళ్ళిపోయారు. దాంతో 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయింది. ఇది చరిత్ర. ఇంతకీ ఎన్టీఆర్ ఎందుకు అలా చేశారు అంటే పూర్తి మాన్యువల్ గా జరిగే ఆనాటి మంత్రి వర్గ సమావేశాలలో వివరాలను లీక్ చేస్తున్నారు అన్న ఆగ్రహంతో. దాంతో ఎన్టీఆర్ కఠినమైన నిర్ణయమే తీసుకున్నారు.

ఎన్టీఆర్ ని గుర్తు చేస్తూ :

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో ఈ సంఘటనను కోరి మరీ ప్రస్తావించారు. ఒక విధంగా మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ విషయాలు వివరాలు లీక్ అయితే ఎంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవచ్చో చరిత్రలో ఉందని అది జరిగిందని చెప్పడానికే ఎన్టీఆర్ ప్రస్తావన బాబు తెచ్చారు. ప్రస్తుతం అంతా ఆధునిక విధానంలో పేపర్ లెస్ గానే కేబినెట్ జరుతోంది. అయితే ప్రభుత్వం నుంచి కీలకమైన సమాచారం బయటకు పోతోంది అని చంద్రబాబు ఆగ్రహించారు. సమాచారం విషయంలో తగినంత గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని ఆయన మంత్రులకు స్పష్టం చేశారు.

లీకు వీరులు ఎవరు :

అసలు కేబినెట్ అజెండా ఎలా లీక్ అవుతోంది అని బాబు ప్రశ్నించారు. అలా లీక్ అయిన దానికి మంత్రులు అంతా బాధ్యత వహించాలని ఆయన పష్టం చేశారు. ఇదే తీరున లీక్ అయితే మాత్రం ఇక మీదట కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లీక్ అన్నది చిన్న విషయం కాదని బాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం బయటకు వెళ్లడం పెద్ద విషయం అని ఆయన అన్నారు.

జనంలోకి వెళ్ళాలి :

అంతే కాదు మంత్రులు వివిధ అంశాల మీద ప్రజలలోకి వెళ్ళాలని వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అంతే కాదు అనేక పధకాల గురించి కూడా వారికి వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఇక జలధారపై ప్రజలలో అవగాహన పెంచాలని చంద్రబాబు కోరారు. అంతే కాకుండా పట్టాదారు పాస్‌బుక్‌లపై అధికారులు మంత్రులు కో ఆర్డినేట్ చేసుకుంటూ నెలకు నాలుగుసార్లు గ్రౌండ్ లెవెల్ లో విజిట్ చేయాలని కోరారు. అదే విధంగా సూర్యఘర్‌ పధకం పైన కూడా మంత్రులు మరింత దృష్టి సారించాలని కోరారు

మహిళా బిల్లు విషయంలో :

ఇక ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు సాగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలలో ప్రవేశపెట్టే మహిళా బిల్లు నేపథ్యంలో మంత్రులు అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కీలక బిల్లు మీద మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. అలాగే మహిళలను ఆకట్టుకునేలా ప్రచారం చేయాలని ఎక్కడికక్కడ ప్రజలలో ఈ బిల్లు మీద పూర్తి అవగాహన కల్పించాలని చంద్రబాబు కోరడం విశేషం.