Begin typing your search above and press return to search.

టైమ్లీ పాలిటిక్స్‌: త‌మ్ముళ్లు సిద్ధం కావాలి..!

స‌మ‌యానికి త‌గు మాటలాడి.. అన్న‌ట్టుగా నాయ‌కులు కూడా స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందించాల్సి న అవ‌స‌రం ఉంది

By:  Garuda Media   |   11 Jun 2026 5:00 AM IST
టైమ్లీ పాలిటిక్స్‌: త‌మ్ముళ్లు సిద్ధం కావాలి..!
X

స‌మ‌యానికి త‌గు మాటలాడి.. అన్న‌ట్టుగా నాయ‌కులు కూడా స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు కూడా చెబుతున్నారు ఈ నెల 25 వ తేదీ నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ఆయ‌న ఇప్ప‌టికే దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ప‌క్కా కార్యాచ‌ర‌ణ‌ను కూడా రూపొందించారు. తాను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్న‌ట్టు చెప్పారు. అంద‌రూ సైకిల్‌పైనే వెళ్లాల‌ని కూడా ష‌ర‌తు విధించారు. త‌ ద్వారా.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు ప్రాదాన్యం ఉంటుంద‌న్నారు.

స‌మ‌స్య‌లు ఏంటి..?

అయితే.. చంద్ర‌బాబు చెప్పిన సూచ‌న‌లు, ఆయ‌న చేసిన దిశానిర్దేశాన్ని నాయ‌కులు అమ‌ల్లోకి పెట్టాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో త‌మ‌ కు ఎద‌ర‌య్యే ముఖ్య స‌మ‌స్య‌ల‌పై పార్టీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు కు ఏక‌రువు పెట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. ఈ ఫ‌లాలు చాలా మందికి చేర‌డం లేదు. ఇదే ఇప్పుడు త‌మ్ముళ్ల‌కు స‌మ‌స్య‌గా మారింది. అయితే.. దీనికి విరుగుడుగా గ్రౌండ్ వ‌ర్క్ చేయాల‌ని పార్టీ చెబుతోంది.

ఏంట‌ది..?

అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను లిస్టు రాసుకుని.. నియోజ‌క‌వ‌ర్గం, మండ‌లం, గ్రామం, ఇల్లు.. ఇలా దేనిక‌దే విభ‌జ‌న చేసుకుని.. ఒక ఇంట్లో ఎంత మంది ల‌బ్ధిదారులు ఉన్నారు? వారికి ప్ర‌భుత్వం నుంచి ఏయే సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయ‌నే విష‌యాన్ని లిఖిత పూర్వ‌కంగా వివ‌రించాల‌ని తాజాగా పార్టీ నుంచి మండ‌ల‌స్థాయి నాయ‌కుల‌కు స‌మాచారం చేరింది. ఈ లిస్టును త‌యారు చేసుకునేందుకు 10 రోజుల స‌మ‌యం ఉంద‌ని కూడా చెబుతున్నారు.

ఈ లిస్టుల వారీగా క‌ర‌ ప‌త్రాలు రూపొందించి.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించాల న్నది చంద్ర‌బాబు చెబుతున్న మాట‌. అదే స‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో పెండింగులో ఉన్న స‌మ‌స్య‌లు .. ప్ర‌స్తుతం నెర‌వేరిన అంశాలు.. ముఖ్యంగా ర‌హ‌దారులు, తాగునీరు.. పింఛ‌న్ల పంపిణీ, ఉద్యోగాల కల్ప‌న పై వ‌ర్క‌వుట్ చేయాల‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. రెండేళ్ల‌లో ప్ర‌భుత్వం చేసిన మంచిని వివ‌రించాల‌ని తేల్చారు. దీనికి త‌మ్ముళ్లు సిద్ధం కావాల‌ని సూచించారు. మ‌రి ఇంత గ్రౌండ్ చేస్తారో లేదో చూడాలి.