Begin typing your search above and press return to search.

ఒకేచోటకు బాబు-లోకేష్ టూర్లు...వాటికి శ్రీకారం

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఒకేసారి టూర్లు పెట్టుకున్నారు. ఇద్దరూ ఉత్తరాంధ్రకు ఒకేసారి వస్తున్నారు. ఇద్దరూ పక్క పక్క జిల్లాలలో ఈ పర్యటనలు చేస్తున్నారు.

By:  Satya P   |   28 Feb 2026 9:35 AM IST
ఒకేచోటకు బాబు-లోకేష్ టూర్లు...వాటికి శ్రీకారం
X

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఒకేసారి టూర్లు పెట్టుకున్నారు. ఇద్దరూ ఉత్తరాంధ్రకు ఒకేసారి వస్తున్నారు. ఇద్దరూ పక్క పక్క జిల్లాలలో ఈ పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటిస్తే నారా లోకేష్ అనకాపల్లి జిల్లాలో పర్యటన పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కీలకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దాంతో ఒకే టైం లో తండ్రీ కొడుకుల టూర్లు ఆసక్తిని పెంచుతున్నాయి. అంతే కాదు ఇద్దరు అగ్ర నేతలూ ఉత్తరాంధ్ర కు ప్రాధాన్యత ఇస్తూ ఈ పర్యటనకు చేయడం ఈ ప్రాంతం ప్రాముఖ్యతను కూడా తెలియచేస్తోంది.

చీపురుపల్లిలో బాబు :

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని రావివలస గ్రామంలో 28న పర్యటించనున్నారు. ముందుగా బాబు చీపురుపల్లిలో మండలంలోని రావివలసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వచ్చిన బాలికలతో బాబు ముఖాముఖి ఉంటుంది.

ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ :

ఇదిలా ఉంటే బాబు ప్రారంభిస్తున్న ఈ వ్యాక్సినేషన్ ఉచితంగా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ లభించనుంది. ఇక ఇదే హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి ప్రారంభిస్తారు.జాతీయ స్థాయిలో జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రావివలస నుంచే వర్చువల్ గా పాల్గొంటారు. ఆ తరువాత చంద్రబాబు రావివలసలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

లోకేష్ చేతుల మీదుగా :

ఇక నారా లోకేష్ అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి లో ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ కి శంకుస్థాపన చేస్తారు. 2,300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మాణం జరుపుకోబోయే ఈ పరిశ్రమ వల్ల 1,750 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2028 నాటికి ఈ పరిశ్రమ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఉత్తరాంధ్రాలో అభివృద్ధి వేగంగా సాగుతోందని లోకేష్ పేర్కొనడం విశేషం.