Begin typing your search above and press return to search.

జగన్ మురిపెం...బాబు మమేకం

జనాలు కొలమానం అన్నది ఓల్డ్ ట్రెండ్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక నాయకుడికి జనాలు రావడం అన్నది విజయానికి ఏ మాత్రం కొలమానం కాదని స్పష్టంగా చెప్పేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Dec 2025 9:00 AM IST
జగన్ మురిపెం...బాబు మమేకం
X

జనాలు కొలమానం అన్నది ఓల్డ్ ట్రెండ్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక నాయకుడికి జనాలు రావడం అన్నది విజయానికి ఏ మాత్రం కొలమానం కాదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. జనాలు రావడం అన్నది ఈ రోజులలో పెద్దగా లెక్కించాల్సిన విషయం కానే కాదని అంటున్నారు ఆ మాటకు వస్తే ఎవరి సభలకు జనాలు రావడం లేదు అన్న ప్రశ్న ఉంది. ఎక్కువ తక్కువలలో అంతా జనాలతోనే ఉంటారు. ఇక 2024 ఎన్నికలు చూసినా దానికి ముందు ఎన్నికలు చూసినా జనాలు ఏపీలో అన్ని పార్టీల వెంటా కనిపించారు. ముఖ్యంగా చంద్రబాబు సభలకూ అలాగే జగన్ సభలకూ పవన్ సభలలూ విరగబడి వచ్చారు. కానీ రిజల్ట్ మాత్రం వేరేగా వచ్చింది. దాంతో జనాలు పారామీటర్ కానే కాదని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.

జగన్ మురుస్తున్నారా :

ఇక చూస్తే వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారు. దాంతో ఆయన బాగా సంతోషిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ అయితే ఇక అధికారం మాదే అని ధీమా ప్రదర్శిస్తోంది. జగన్ కి జనాలు రావడం 2024 లోనూ జరిగింది, దానికి ముందూ జరిగింది అన్న సత్యాన్ని మాత్రం వైసీపీ నేతలు గుర్తించడం లేదా అన్న ప్రశ్న కూడా వస్తోంది. వస్తున్న జనాలను చూసి గెలుపు అని వైసీపీ మురుస్తూంటే టీడీపీ కూటమి వేరే విధంగా ఆలోచిస్తోంది అని అంటున్నారు.

నిరంతరంగా :

ఇక కూటమి అధికారలోకి వచ్చాక ఒక విషయం ఆలోచిస్తే కనుక చంద్రబాబు పవన్ లోకేష్ ముగ్గురూ నిరంతరం జనంలోనే ఉంటున్నారు వారితోనే మమేకం అవుతున్నారు. పెద్ద సభల నుంచి చిన్న సమావేశాలు అలాగే ముఖాముఖీలు ఇలా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని జనం వద్దకు వెళ్తున్నారు. ఈ మధ్యనే మెగా డీఎస్సీ పేరుతో నియామక పత్రాలు వేలాది మంది మధ్యన అందించారు. తాజాగా పోలీస్ కానిస్టేబుళ్ళకు నియామక పత్రాలను అందించారు. అది కూడా బాగానే సభ నిర్వహించి చేపట్టారు.

గ్రౌండ్లోనే ఉంటే :

ఇక చంద్రబాబు ఆలోచనలు చూస్తే తామంతా గ్రౌండ్ లోనే ఉంటే కనుక జగన్ సభలకు జనాలు వచ్చినా పెద్దగా పట్టింపు ఉండదన్న్నది. జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారు, అయితే వైసీపీ నుంచి ఏ రకమైన హామీ వారికి లభిస్తోంది అన్నది కూడా విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ తాము చేసినది చెబుతోంది. చేయాల్సింది కూడా చెబుతోంది, సమస్యలను సైతం పరిష్కరించేందుకు చూస్తోంది. దాంతో జనాలతో మమేకం అయితే కూటమి ప్రభుత్వం వల్లనే పనులు అవుతాయన్న సందేశాన్ని బలంగా జనంలోకి పంపిస్తున్నారు అని అంటున్నారు.

అధికారంలో ఉన్నా :

సాధారణంగా అధికారంలో ఉన్న వారు జనంలోకి పెద్దగా రారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎపుడూ ప్రజలలో ఉండేందుకు చూస్తోంది. తాను మాత్రమే కాదు అధికారులను ప్రజా ప్రతినిధులను ఇలా గ్రామ స్థాయి వరకూ ఉన్న క్యాడర్ ని ప్రభుత్వం యంత్రాంగాన్ని కూడా జనంలో ఉంచి పాలన వారికి కళ్ళకు కట్టి చూపించాలని ప్రయత్నిస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల సమస్యలు ఉన్నా కూడా వారు తమ వైపే చూస్తారు అని తమకే చెప్పుకుంటారన్నది కూటమి పెద్దల ఆలోచనగా ఉంది. అదే సమయంలో జగన్ వెంట జనాలు వచ్చినా ఆయనను చూసేందుకు మాత్రమే పరిమితం అవుతారని, అలాగే ఆ విషయాన్ని రాజకీయంగానూ పరిమితం చేస్తూ పెద్దగా ప్రభావం లేకుండా చూడాలన్న వ్యూహంతోనే కూటమి పార్టీలు ముందుకు కదులుతున్నారు అంటున్నారు. మొత్తం మీద ఇక్కడ తేలేది ఏమిటి అంటే జగన్ కానీ వైసీపీ కానీ వస్తున్న జనాలను చూసి మురిసిపోతే ముప్పే అన్నది కూటమి నయా స్ట్రాటజీలను అర్ధం చేసుకోవాలని అంటున్నారు.