Begin typing your search above and press return to search.

సడెన్ గా బాబు ఢిల్లీ టూర్...మ్యాటర్ సీరియస్ ?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 9వ తేదీ అంటే సోమవారం బాబు ఢిల్లీ వెళ్తారు అని అంటున్నారు.

By:  Satya P   |   7 Feb 2026 11:12 PM IST
సడెన్ గా బాబు ఢిల్లీ టూర్...మ్యాటర్ సీరియస్  ?
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 9వ తేదీ అంటే సోమవారం బాబు ఢిల్లీ వెళ్తారు అని అంటున్నారు. దీంతో బాబు ఢిల్లీ టూర్ మీద అంతా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకు ఢిల్లీ టూర్ అన్నది కూడా ఎవరి మటుకు వారు ఆలోచన చేస్తున్నారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలలో సీఎంలు ఢిల్లీ టూర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కేంద్ర కేబినెట్ మొత్తం అక్కడే ఉంటుంది పైగా పెద్దల అపాయింట్మెంట్స్ అన్నీ ఒకేసారి దొరుకుతాయని పర్యటనలు పెట్టుకుంటారు. అయితే కేంద్ర బడ్జెట్ కి ముందే ఢిల్లీ పర్యటన చేసిన చంద్రబాబు ఇపుడు మరోసారి హస్తిన పయనం కట్టడం వెనక మ్యాటర్ ఏంటి అన్నది అంతా ఆలోచిస్తున్నారు.

లడ్డూ వివాదం హీట్ :

ఏపీలో ఇపుడు లడ్డీ వివాదం హీట్ లో ఉంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని టీడీపీ కూటమి అంటోంది వైసీపీ అయితే సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెబుతోంది ఇలా రెండు వైపులా డైలాగ్ వార్ కానీ డిబేట్ కానీ హోరా హోరీగా సాగుతోంది. ఈ నేపధ్యంలో కూటమి పార్టీలతో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల క్రితం సమావేశం అయి అంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. ఆ మీదట బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా లడ్డూ ప్రసాదం మీద మాట్లాడుతున్నారు. అయితే ఆ సౌండ్ ఏ మాత్రం సరిపోవడం లేదు అన్న భావన ఉంది.

కేవలం టీడీపీ మీదనే :

ఇక వైసీపీ చూస్తే టీడీపీ మీదనే దాడి చేస్తోంది. మిత్రులను వదిలిపెడుతోంది. ఒక వ్యూహం ప్రకారమే ఇలా చేస్తోంది అని టీడీపీ పెద్దలు అనుమానిస్తున్నారు. ఇంకో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇచ్చిన నివేదికను ఆసరాగా చేసుకుని వైసీపీ కూటమిని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర పెద్దలతో బాబు సమావేశం అవుతారు అని అంటున్నారు. అంతే కాదు లడ్డూ కల్తీ జరిగింది అన్న దానిని కూడా ప్రస్తావిస్తారు అని అంటున్నారు. అదే సమయంలో ఏపీ రాజకీయాల గురించి కూడా వివరించి ప్రస్తుతం సాగుతున్న పరిణామాలను కూడా వారి ముందు పెడతారు అని అంటున్నారు.

కేంద్ర పెద్దల వైఖరి :

ఏపీ రాజకీయాల విషయంలో కేంద్ర పెద్దల వైఖరి కూడా తెలుసుకునే ప్రయత్నం జరగవచ్చు అన్నది కూడా ఉంది అంటున్నారు. లడ్డూ ప్రసాదం విషయం అన్నది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన అంశంగా టీడీపీ చూస్తోంది. చాలా సీరియస్ గా తీసుకుంటోంది. దీనికి ఒక లాజిక్ ఎండింగ్ పడాలని భావిస్తోంది. వైసీపీ మీద చేస్తున్న రాజకీయ యుద్ధంలో కేంద్రం సైతం మరింత అధికంగా సహకారం అందించాలని కలసి రావాలని కోరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.