Begin typing your search above and press return to search.

కార్య‌క‌ర్త‌కే పెద్ద‌పీట‌.. మ‌హానాడుపై చంద్ర‌బాబు!

ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న మ‌హానాడులో కార్య‌క‌ర్త‌ల‌కే పెద్ద పీట వేయాల‌ని పార్టీ అదినేత‌, సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. కార్య‌క‌ర్త‌ల సెంట్రిక్ గానే కార్య‌క్ర‌మాల‌ను రూపొందించాల‌ని ఆదేశించారు.

By:  Garuda Media   |   21 May 2026 8:45 PM IST
కార్య‌క‌ర్త‌కే పెద్ద‌పీట‌.. మ‌హానాడుపై చంద్ర‌బాబు!
X

ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న మ‌హానాడులో కార్య‌క‌ర్త‌ల‌కే పెద్ద పీట వేయాల‌ని పార్టీ అదినేత‌, సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. కార్య‌క‌ర్త‌ల సెంట్రిక్ గానే కార్య‌క్ర‌మాల‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. రెండు రోజుల పాటు నిర్వ‌హించే మ‌హానాడును పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా గురువారం.. పార్టీ పొలిట్ బ్యూరో స‌మావేశం నిర్వ‌హించారు.

వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో మ‌హానాడుకు సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై చంద్ర బాబు దిశానిర్దేశం చేశారు. కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. మ‌హానాడులో ఈ స్ఫూర్తి ప్ర‌తి విష‌యంలో నూ క‌నిపించాల‌ని సూచించారు. అదేవిధంగాపార్టీలోను.. ప్ర‌భుత్వంలోనూ మ‌హిళ‌ల‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివ‌రించేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని సూచించారు. టీడీపీ వ్య‌వ‌స్థాగ‌త ఓటు బ్యాంకును కాపాడుకునేలా కార్యాచ‌ర‌ణ ఉండాల‌న్నారు.

మ‌రీ ముఖ్యంగా బీసీల‌కు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం.. రాబోయే రోజుల్లో పార్టీలో తీసుకునే చ‌ర్య‌ల‌ను కూడా ప్ర‌తి ఒక్క‌రూ అవ‌గాహ‌న పెంచుకోవాల‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సంక్షిప్తంగా.. ఇచ్చిన స‌బ్జెక్టుపైనే మాట్లాడా ల‌ని.. ప్ర‌శంస‌లకు చోటు ఇవ్వొద్ద‌ని పేర్కొన్నారు. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మందికి అవ‌కాశం క‌ల్పించే దిశ‌గా అడుగులు వేయాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్‌బ్యూరో స‌భ్యులు ఆమోదం తెలిపారు.

పొదుపు పాటించాలి..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధన పొదుపు చర్యలపై పొలిట్ బ్యూరోలో చంద్ర‌బాబు చర్చిం చారు. గడిచిన 2 ఏళ్ల ప్రభుత్వ పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూపొందించిన కార్యాచరణపై సమావేశంలో స‌భ్యుల అభిప్రాయాలు తెలుసూఉకున్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాల ని.. మ‌హానాడు అనంత‌రం.. అంద‌రూ ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని పేర్కొన్నారు.