Begin typing your search above and press return to search.

బాబు ప్రకటించిన బే సిటీ ప్రాజెక్టు...ఇంట్రెస్టింగ్

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన చేశారు. అది కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన విశాఖ వచ్చి సైకిలింగ్ చేసారు.

By:  Satya P   |   6 Jun 2026 4:00 AM IST
బాబు ప్రకటించిన బే సిటీ ప్రాజెక్టు...ఇంట్రెస్టింగ్
X

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన చేశారు. అది కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన విశాఖ వచ్చి సైకిలింగ్ చేసారు. తాను పాల్గొనవలసిన కార్యక్రమం వేదిక వద్దకు ఆయన ఏయూ నుంచి సైకిల్ మీద వెళ్ళారు. ఆ విధంగా ఇటు నాలుగు అటు నాలుగు కిలోమీటర్లు మొత్తం ఎనిమిది కిలోమీటర్లు సైకిలింగ్ చేయడం ద్వారా బాబు విశాఖతో పాటు ఏపీకి కూడా సరికొత్త సందేశం ఇచ్చారు. ఇదిలా ఉంటే విశాఖ ఎకనమిక్ రీజియన్ సమీక్షలో పాల్గొన్న చంద్రబాబు విశాఖలో మరో కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని ప్రకటించారు.

బే సిటీ ప్రాజెక్టు తో కొత్త కళ :

ఇదిలా ఉంటే బే సిటిగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై చంద్రబాబు తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో విశాఖ వేదికగా తొలిసారి సమీక్ష నిర్వహించారు. విశాఖలోని కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ ఈ బేసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విశాఖలో గ్రేహౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలని బాబు ఆదేశించారు. అలాగే కైలాసగిరి ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని బాబు మరో సూచన చేశారు.

విశాఖ డిజైన్ మారుస్తూ :

ఇదిలా ఉంటే విశాఖలో బీచ్ వాటర్ స్పోర్ట్స్ తో పాటు వినోదం కలిగించే వివిధ ప్రాజెక్టులు చేపట్టేలా పెట్టుబడులను ఆహ్వానించాలని కూడా బాబు కోరారు. విశాఖలోని జంతు ప్రదర్శన శాలను కూడా ఆధునీకరించి పర్యాటకుల్ని ఆకర్షించేలా చూడాలని బాబు సూచించారు. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు, బౌద్దక్షేత్రాలు అభివృద్ధి చేయాలని బాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే బాబు చెప్పిన విధంగా అధికారులు విశాఖను టూరిజం పరంగా రీ షేప్ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం తధ్యమని అంటున్నారు.

రాజమహేంద్రవరం కూడా :

అంతే కాకుండా శాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఉన్న రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు, పోలవరం ప్రాజెక్టు, పాపికొండలు లాంటి పర్యాటక ప్రాంతాలు అదనపు ఆకర్షణలుగా బాబు చెప్పారు. వాటిని సైతం టూరిజం హబ్స్ గా అభివృద్ధి చేయాలని బాబు కోరారు. ఆయాప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశముందని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల వద్ద పారిశ్రామిక ప్రాంతాలను ఆనుకుని ఏర్పాటు చేసే టౌన్ షిప్ ల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం విశేషం. అలాగే నీతి ఆయోగ్ సమర్పించిన వీఈఆర్ ప్రాజెక్టు నివేదికను ప్రజల్లో చర్చకు ఉంచాలని అందులో విద్యార్థులు, మేధావుల నుంచి అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోవాలని బాబు అధికారులకు సూచించడం విశేషం.