Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికలే టార్గెట్... కూటమి మంత్రులకు అలెర్ట్ !

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించే విధంగా ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ అంతా రంగంలోకి దిగాలని చంద్రబాబు కోరారు.

By:  Satya P   |   13 July 2026 9:15 AM IST
స్థానిక ఎన్నికలే టార్గెట్... కూటమి మంత్రులకు అలెర్ట్ !
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మరి కొద్ది నెలలలో మోగనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరన కానీ లేదా అక్టోబర్ లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ నేతలతో జాం మీటింగ్ సందర్భంగా బాబు ఈ సంగతి వెల్లడించారు. సర్ ప్రక్రియ ఏపీలో ప్రస్తుతం సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.

పార్టీ శ్రేణులు రెడీ :

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించే విధంగా ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ అంతా రంగంలోకి దిగాలని చంద్రబాబు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని బాబు పిలుపు ఇచ్చారు. అన్ని చోట్లా పార్టీ జెండా ఎగగేసే విధంగా క్యాడర్ పూర్తి అప్రమమత్తతో అంకిత భావంతో పనిచేయాలని ఆయన కోరారు.

ముందుగా మున్సిపల్ ఎన్నికలు :

ఇదిలా ఉంటే మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అదే విధంగా దశల వారీగా మిగిలిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఇదే విషయాన్ని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా చెప్పారు. మునిసిపల్ ఎన్నికలు తొందరలోనే జరుగుతాయని నారాయణ వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన చెప్పడం విశేషం.

మంత్రులకు పరీక్ష :

ఇక ఏపీలో మంత్రివర్గ విస్తరణ మీద రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎపుడు విస్తరణ అంటే ఆగస్టులో అని అంటున్నా మరి విజయదశమి తరువాత అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు అన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల తరువాతనే జరగవచ్చు అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రుల సత్తాకు కూడా ఒక పరీక్షగా ఉంటుందని అంటున్నారు. ఈ పరీక్షను నెగ్గిన వారికే అవకాశాలు మెరుగు అవుతాయని అంటున్నారు. అలాగే జిల్లాలలో ఎవరైతే బాగా కష్టపడతారో ఆ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులలో అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు.

కష్టపడాల్సిందే :

మొత్తానికి చూస్తే 2024 ఎన్నికల తరువాత ఏపీలో మరో మినీ ఎన్నికల సమరానికి తెర లేవనుంది. ఏపీలో మున్సిపల్ పంచాయతీలు, అలాగే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు ఎన్నికలు అంటే మొత్తం ప్రజలు అంతా ఓటేస్తారు. ఆ విధంగా చూస్తే రెండున్నరేళ్ళ కూటమి పాలన మీద ప్రజాభిప్రాయం వ్యక్తం అవుతుందని అంటున్నారు. అదే సమయంలో అనేక సంక్షేమ పధకాలతో పాటు అభివృద్ధిని కూడా చేపట్టామని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీదీపీ క్యాడర్ అంతా కష్టపడాల్సి ఉందని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా ఇదే చెబుతోంది. ఎవరైతే ప్రజలలో ఉంటూ కష్టపడి పార్టీని గెలిపిస్తారో వారికే ప్రాధాన్యత ఇస్తామని అంటోంది. ఈ విధంగా చూస్తే బూత్ లెవెల్ క్యాడర్ నుంచి మంత్రుల దాకా అందరికీ స్థానిక ఎన్నికలు అతి పెద్ద పరీక్షగా నిలవనున్నాయని అంటున్నారు. చూడాలి మరి టీడీపీ అధినాయకత్వం ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నేతలు అంతా ఏ విధంగా స్పందించి రంగంలోకి దిగుతారో, ఏ రకమైన ఫలితాలను రాబడతారో.