Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ని చేసిన చంద్రబాబు అమరావతిని ఎందుకు చేయలేకపోతున్నారు ?

హైదరాబాద్ అంటే చంద్రబాబు అని ఆయన అనుకూల మీడియా చెబుతుంది. టీడీపీ అయితే విజనరీ అని అంటూ గర్విస్తుంది.

By:  Tupaki Desk   |   25 April 2025 2:42 PM
హైదరాబాద్ ని  చేసిన చంద్రబాబు అమరావతిని ఎందుకు చేయలేకపోతున్నారు ?
X

హైదరాబాద్ అంటే చంద్రబాబు అని ఆయన అనుకూల మీడియా చెబుతుంది. టీడీపీ అయితే విజనరీ అని అంటూ గర్విస్తుంది. ఇక బాబు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ అని అంతా అంటూంటారు. కేవలం రాజకీయ నేతలే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా బాబు ఈజ్ గ్రేట్ అని పొగుడుతూ ఉంటారు.

తాజాగా విజయవాడలో జరిగిన ఒక పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు గురించి మాట్లాడుతూ చాలా ఆసక్తి కలిగించే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని ఏకంగా మహా నాయకుడు అన్నారు. ఆయన విద్యార్ధి దశ నుంచే అంచలంచెలుగా ఎదిగారని కొనియాడారు.

బాబు ముందు చూపు వల్లనే హైదరాబాద్ లో ఐటీ రంగంలో ఊపందుకుందని అన్నారు. అంతటితో ఆగలేదు, హైదరాబాద్ కి చంద్రబాబు పయనీర్ అనేశారు. హైదరాబాద్ అన్ని రంగాలలో దూసుకుని వెళ్ళేలా ఆయన ఒక విజన్ తో పనిచేసారు అని కితాబు ఇచ్చారు.

ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. హైదరాబాద్ ని చంద్రబాబు కూడా అభివృద్ధి చేశారు అన్న దానికి అత్యధికులు అంగీకరిస్తారు. చంద్రబాబు మాత్రమే అన్న దానితో విభేదిస్తారు. దానికి కారణం హైదరాబాద్ చరిత్ర చూస్తే నాలుగు వందలది. పైగా అది ప్రవర్ధమానం అవుతూ ముందుకు సాగుతూ వస్తోంది.

మరో వైపు చూస్తే హైదరాబాద్ ఐటీ అని అంటున్న వారు అదే సమయంలో బెంగళూరు ఐటీ చెన్నై, ముంబై ఐటీ కేంద్రాలు ఎదిగిన తీరుని ఏ విధంగా సమర్థించుకుంటారు అని అంటారు. నిజమే చంద్రబాబు ఐటీని బాగా ప్రమోట్ చేశారు. కానీ ఆ కాలమంతా ఐటీతోనే ఆంతా సాగింది అని చెబుతారు.

ఇక చంద్రబాబు విజనరీ కేవలం హైదారాబాద్ కే ఎందుకు పరిమితం అయింది అమరావతిలో ఆయన విజం మాయాజాలం ఎందుకు పనిచేయడం లేదని కూడా ప్రశ్నిస్తారు. దానికి సమాధానం చెప్పేవారు కూడా ఉన్నారు. హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన నగరం. దాని మీద మరింత ప్రగతి ఎవరు చేసినా ఎత్తున నిలిచి కనిపిస్తుంది. అదే చంద్రబాబు కూడా చేశారు అని అంటారు.

ఇక అమరావతి రాజధాని చూస్తే అది మొదటి అడుగు దగ్గరే ఉంది. దానిని ఎత్తుకు తీసుకెళ్ళాలి అంటే అంత బరువు మోయాలి. అది ఏ ఒక్కరి వల్లనో జరిగేది కాదు. పరిణామ క్రమంలోనే ఇదంతా జరుగుతుంది. అలా చూసుకుంటే కనుక హైదరాబాద్ అన్న రహదారి మీద అందమైన రంగులు చంద్రబాబు వేశారు అదే అమరావతి మట్టి రోడ్డుని హైవేగా మార్చాలీ అంటే ఆయన చాలా కష్టపడాలని అంటున్నారు.

ఇంత కష్టపడినా ఫలితాలు అంత సులువుగా రావు అని అంటున్నారు. దానికి కారణం హైదరాబాద్ ఇమేజ్ కూడా బాబు బ్రాండ్ ఇమేజ్ కి దోహదపడింది అని గుర్తు చేస్తున్నారు. మరి అమరావతికి ఆ తరహా ఇమేజ్ ని తేవాలంటే చాలానే చేయాల్సి ఉంటుందని అంటున్నారు. సో చంద్రబాబు హైదరాబాద్ విషయంలో చేసిన అభివృద్ధి ఒక ముందడుగు అయితే అమరావతి విషయంలో అది మొదటి అడుగుగా మాత్రమే మిగిలి ఉందని అంతా గుర్తు చేస్తున్నారు.