Begin typing your search above and press return to search.

ముద్రగడని ఆపింది చంద్రబాబేనా...!?

ముద్రగడను జనసేనలోకి చేర్చుకోవద్దని చంద్రబాబే పవన్ కి చెప్పి ఆపించారా అన్నది కూడా ఇపుడు చర్చకు వస్తోందిట.

By:  Tupaki Desk   |   6 Feb 2024 9:37 AM GMT
ముద్రగడని ఆపింది చంద్రబాబేనా...!?
X

కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయం ఏమిటి అన్న చర్చ అయితే సాగుతోంది. ఏడు పదులకు చేరిన ఈ సీనియర్ నేతకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి అని చెబుతారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆయన రాజకీయంగా పూర్తి స్థాయిలో విరామం తీసుకున్నట్లే. ఎందుకంటే మళ్లీ 2029లోనే ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి కూడా ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు సిద్ధంగా ఉంటారా అంటే అది ఆలోచించాల్సిన విషయమే.

అందుకే ముద్రగడ కూడా ఈసారి తాను పోటీకి సై అన్నట్లుగానే ఒక హడావుడి అయితే ఆ మధ్య దాకా చేశారు. ఇపుడు గమ్మున సైలెంట్ అయ్యారు ఇంతకీ పెద్దాయన ఆలోచనలు ఏంటి అన్నది ఒక ఎడతెగని చర్చగా ఉంది. ఆయన వైసీపీ జనసేన అంటూ వచ్చారు కదా మరి రాజకీయ రూట్ దొరికిందా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

మొదట వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లుగా కనిపించినా ముద్రగడ ఆ తరువాత జనసేనలోకి వెళ్లాలని చూశారు. ఆయన రావాలని అనుకున్నారు. అటూ ఇటూ రాయబారాలు కూడా పెద్ద ఎత్తున సాగాయి. ముద్రగడ ఇంటికి ఇక పవన్ కళ్యాణ్ వెళ్లడమే ఆలస్యం అన్నట్లుగా కూడా మీడియాలో వార్తా కధనాలు వచ్చాయి.

మరి ఎక్కడ బ్రేక్ పడింది. ఎక్కడ ఇదంతా ఆగింది అని చూస్తే కనుక దీని వెనక చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ముద్రగడను జనసేనలోకి చేర్చుకోవద్దని చంద్రబాబే పవన్ కి చెప్పి ఆపించారా అన్నది కూడా ఇపుడు చర్చకు వస్తోందిట.

ఎందుకు ఇలా బాబు చేశారు అంటే ముద్రగడ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తారు అని బాబు భావించి అదే విషయం పవన్ కి చెప్పారని అంటున్నారు. ఆయన కనుక జనసేనలో చేరితే ఆయన నాలుగు సీట్లు ఎక్కువ అడుగుతారు అని అవి గెలవని అతని మనుషులకు ఇప్పించుకుని తద్వారా వైసీపీకి మేలు చేస్తారు అని చంద్రబాబు తనదైన ఆలోచనలను పవన్ కి చెప్పారని అంటున్నారు

దాంతో అది వినే పవన్ కూడా ముద్రగడ వద్దు అనేసుకున్నారు అని అంటున్నారు. ఇక ముద్రగడ వల్ల రాజకీయంగా కూడా పెద్దగా ఉపయోగం ఏమీ లేదని ఓట్లు పడే సీన్ కూడా లేదని కూడా కూటమి పెద్దలు భావించారు అని అంటున్నారు. ముద్రగడ అవుట్ డేటెడ్ అని కూడా చంద్రబాబు పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలో కాపు యువతలో ఫాలోయింగ్ అంతా పవన్ కే ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. ఇక ముద్రగడ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయనది కూడా చంద్రబాబుతో సమానమైన రాజకీయ అనుభవం. అలాంటి వారు కనుక జనసేనలో ఉంటే పవన్ పక్కన ఉంటే కచ్చితంగా అది కూటమికి మేలు కాకపోతే కూటమిని ఇబ్బంది పెట్టేది గా ఉంటుందని కూడా చంద్రబాబు ఒప్పుకోలేదని అంటున్నారు.

అందుకే ముద్రగడ జనసేనలోకి వచ్చేందుకు ఇష్టపడినా పవన్ మనసు మర్చి పెద్దాయనను ఈ వైపు రాకుండా బాబు విష్ణు చక్రం అడ్డువేశారు అని అంటున్నారు. నిజానికి చూస్తే కూడా ముద్రగడ ఎవరికీ కొరుకుడు పడని మనిషి అని అంటారు. ఆయన ఎన్టీయార్ నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి నుంచి చూస్తే చంద్రబాబు వరకూ చాలా మంది ముఖ్యమంత్రులనే ఢీ కొట్టి వారినే ఇబ్బందులు పెట్టారని అంటారు.

ఆయన తీసుకున్న కార్యక్రమం లక్ష్యాలు మంచివే అయినా పట్టు విడుపులు పెద్దగా ఆయనకు పట్టవని దానికి మించి ఆయన దూకుడుగా వెళ్తారని అపుడు ఎవరినీ స్పేర్ చేసే సీన్ ఉండదని అంటారు. అందుకే ముద్రగడ లాంటి వారు స్పెషల్ పొలిటీషియన్ గానే ఉంటారు. వారిని పార్టీలు తీసుకున్నా ఎక్కువ కాలం ఆయన పనిచేయలేరు. వారు కూడా ఆయనతో కలసి నడవరు. ఇది ఆయన రాజకీయ చరిత్ర చూస్తే అర్ధం అవుతుంది అని అంటున్నారు. ఇక జనసేనలో చూస్తే పవన్ ఒక్కరే అక్కడ ఉన్నారు.

ముద్రగడ లాంటి వారి వచ్చి చేరితే కచ్చితంగా పొత్తును పడనివ్వరు అని కూడా రాజకీయం తెలిసిన వారు అనే మాట. కనీసంగా యాభై నుంచి అరవై దాకా సీట్లు తీసుకోవాలనే వత్తిడి పెడతారు. అది తెగకపోగా మొదటినే మోసం వస్తుంది.అందుకే వన్ మ్యాన్ షో గా పవన్ మాత్రమే ఈ సీట్లు వ్యవహారాన్ని తానుగానే టీడీపీతో తేల్చుకుంటున్నారు అని అంటున్నారు.