Begin typing your search above and press return to search.

కుప్పం విషయంలో చంద్రబాబు నయా ప్లాన్ ఇదే!

ఇందులో భాగంగా... ఈ నెల 28వ తేదీన చంద్రబాబు కుప్పం వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా.. అక్కడే మూడు రోజుల పాటు ఉండ‌నున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2023 9:32 AM GMT
కుప్పం విషయంలో చంద్రబాబు నయా  ప్లాన్  ఇదే!
X

రాబోయే ఎన్నికల్లో "వైనాట్ 175" అంటుంది అధికార వైసీపీ. ఇదే సమయంలో గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ని.. భీమవరం, గాజువాకల్లో పవన్ ని ఓడించినట్లుగానే.. ఈసారి కుప్పంలో చంద్రబాబుని పరాజయం రుచి చూపిస్తామని చెబుతుంది. అందుకు తగ్గట్లుగానే కుప్పం నియోజకవర్గంపై పెద్దిరెడ్డి ప్రత్యేక శ్రద్ధపెట్టారని తెలుస్తుంది. చంద్రబాబుకు చెక్ పెట్టేలా చాపకింద నీరులా కేడర్ ని సమాయత్తం చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో బాబు కుప్పంపై మరోసారి దృష్టి సారించారు.

అవును... గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గం విషయంలో చంద్రబాబుకు చిన్నపాటి టెన్షన్ మొదలైందని అంటున్నారు పరిశీలకులు. అందువల్లే రెగ్యులర్ గా కుప్పాన్ని విజిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా ఎనిమిది సార్లు ఆయ‌న కుప్పంలో ప‌ర్యటించారు! ఇప్పుడు అరెస్టు, విడుదల అనంతరం మరోసారి కుప్పంలో పర్యటించనున్నారు.

ఈ ఏడాదిలో చంద్రబాబు ఇప్పటికే అరెస్ట్ కు ముందు సుమారు 8సార్లు కుప్పంలో పర్యటించిన బాబు... కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇదే సమయంలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని తెలుస్తున్న నేపథ్యంలో... ఈ ఏడాది చివరిగా.. 9వ సారి కుప్పం పర్యటనకు ప్లాన్ చేశారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... ఈ నెల 28వ తేదీన చంద్రబాబు కుప్పం వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా.. అక్కడే మూడు రోజుల పాటు ఉండ‌నున్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఇదే చివరి పర్యటనా.. లేక ఎన్నికల లోపు మరో రెండు మూడు పర్యటనలు ఉండబోతున్నాయా అనేది వేచి చూడాలి!

మొత్తం మీద చూస్తే... చంద్రబాబుకు కుప్పంపై ప్రత్యేక శ్రద్ధపెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న చంద్రబాబు... రాబోయే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలు, జ‌న‌సేన నేత‌ల‌తో క‌లిసి చేయాల్సిన ప్రయాణం గురించి దిశానిర్దేశం చేయ‌నున్నారని తెలుస్తుంది.

కాగా... త్వరలో టీడీపీ - జనసేన సీట్ల సర్ధుబాట్లపై ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. అంతకంటే ముందు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని భవిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో అంతకంటే ప్రధానంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు ఉమ్మడి భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

టీడీపీ - జనసేన కలయికను చాలా మంది వ్యతిరేకిస్తున్నారని.. ఇది పూర్తిగా సెట్ కాని పొత్తు అని అంటున్నారని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ఈ పొత్తు ఆవశ్యకతను ఈ మూడు భారీ బహిరంగ సభలద్వారా ఇరు పార్టీల కేడర్ కు నచ్చచెప్పాలని చూస్తున్నారని తెలుస్తుంది. మరోపక్క టీడీపీ - జనసేన అధికారంలోకి వస్తే... ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసేన కేడర్ ను ప్రశ్నార్ధకంలో పడేసిందని అంటున్న సంగతి తెలిసిందే!