Begin typing your search above and press return to search.

కేంద్రం క్లారిటీ సరిపోలేదా... బురద మాటలంటూ బుగ్గన ఫైర్!

దీంతో ఈ విషయాల పై ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసహనం వ్యక్తం చేశారు. విపక్షాల తీరు పై తీవ్రంగా మండిపడ్డారు.

By:  Tupaki Desk   |   3 Aug 2023 11:20 AM GMT
కేంద్రం క్లారిటీ సరిపోలేదా... బురద మాటలంటూ బుగ్గన ఫైర్!
X

గతకొన్ని రోజులుగా ఏపీ లో అప్పుల పై ప్రభుత్వం - విపక్షల మధ్య తీవ్ర ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీ బీజేపీ తాజా అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ఏపీలో అప్పుల పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాలా సీతారామన్ కి కూడా వినతిపత్రం ఇచ్చివచ్చారు.

ఈ సమయంలో పార్లమెంటులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ లో అప్పులలెక్కలు చెప్పాలని కోరారు. దీని పై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మాలా సీతారామన్ సవివరంగా వివరించిన సంగతి తెలిసిందే. ఆమె చెప్పిన లెక్కల ప్రకారం చంద్రబాబు హయాంతో పోలిస్తే.. జగన్ ఈ నాలుగేళ్లలో చేసిన అప్పులు తక్కువే అని అర్ధం అయ్యింది!

అవును... ఏపీ లో టీడీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి రూ.2,64 లక్షల కోట్లు అప్పులు భారం రాష్ట్రం పై ఉందని.. 2023 నాటికి అంటే వైసీపీ నాలుగేళ్ల పాలన తర్వాత రూ.4.41 లక్షలకు చేరిందని నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు. అంటే... నాలుగేళ్ల వైసీపీ పాలన లో మొత్తం మీద రూ.1.77 లక్షల కోట్లు అప్పుల భారం పడిందని చెప్పారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి ఇంత క్లియర్ గా చెప్పినా కూడా విపక్షాలు శాంతించినట్లు కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ విషయాల పై ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసహనం వ్యక్తం చేశారు. విపక్షాల తీరు పై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ఆర్ధిక మంత్రి పార్లమెంటులో వివరణ ఇచ్చాక కూడా వమర్శలు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా... ఏపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ వస్తోన్న ఆరోపణలకి కేంద్రమే సమాధానం చెప్పిందని స్పష్టం చేసిన బుగ్గన రాజేంద్రనాథ్... ఈ నాలుగేళ్ళ అప్పులపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారని, గత ప్రభుత్వం చేసిన అప్పుల పై ఎందుకు మాట్లాడ్డం దని నిలదీశారు. ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందకూడదని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

అప్పుల పై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఎవరు మాట్లాడరని.. ఏపీ శ్రీలంక అయిపోతుందని మాట్లడతారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఏపీ లో నివాసం లేని వారు ఇంకా ఎక్కువ విమర్శలు చేస్తున్నారని.. ఉండేది హైదరాబాద్ లో, చేసే విమర్శలు ఏపీపైనా అంటూ ప్రశ్నించారు.

ఇదే సమయంలో కొంతమంది తమను తాము ఆర్ధికవేత్తలుగా ప్రకటించేస్తుకుంటున్నరని... ఈ స్వప్రకటిత ఆర్ధిక వేత్తలకు కేంద్రం చెప్పిన లెక్కలు అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు! రాష్ట్రంలో అప్పుల పై చాలా మంది చాలా మాట్లాడుతున్నారని.. సొంతంగా ప్రకటించుకున్న అర్డికవేత్తలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఇలా అప్పులపై అవగాహనలేకుండా మాట్లాడేస్తున్నారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

అయితే ఏపీ లో అప్పుల పై, విపక్షాలు చేస్తోన్న విమర్శల పై పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చేశారని బుగ్గన గుర్తుచేశారు. మొత్తం అప్పు 4.41 లక్షల కోట్లు ఉందని కేంద్ర ఆర్ధికమంత్రే చెప్పారని.. మరి అందరూ ఆరోపించిన 10 లక్షల కోట్లు ఏమైనట్లని తనదైన శైలిలో ప్రశ్నించారు ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్!

ఈ సందర్భంగా... "నేను సింహం" అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని.. ఆయన కుమారుడు కూడా జంతువులతో పోల్చుకుంటున్నారని ఎద్దేవాచేసిన బుగ్గన... అప్పుల విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక్క మాట లేదని.. ఒక్కొక్కరిది ఒక్కో మాట అని విమర్శించారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా, ఇంకెవరు ఎన్ని విమర్శలు చేసినా... వీటన్నిటికీ కేంద్రం పార్లమెంటులో సమాధానం చేప్పేసిందని కన్ క్లూజన్ ఇచ్చారు!