Begin typing your search above and press return to search.

మూసాపేటలో పాశవిక రేప్.. ఘటనాస్థలంలోనే కన్నుమూసిన బాధితురాలు!

కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 5:23 AM GMT
మూసాపేటలో పాశవిక రేప్.. ఘటనాస్థలంలోనే కన్నుమూసిన బాధితురాలు!
X

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఇంత అరాచకమా? అన్న భావన కలిగే ఉదంతం కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో చోటు చేసుకుంది. చిత్తుకాగితాలు ఏరుకొని జీవించే మహిళపై తెల్లవారుజామున ఇద్దరు యువకులు చేసిన పాశవిక రేప్ లో తీవ్ర రక్తస్రావమై.. ఘటనాస్థలంలోనే మరణించిన వైనం కలిచివేసేలా మారింది. కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు.

మూసాపేట జంక్షన్ వద్ద ఈ అమానుష ఘటన జరిగింది. బాలానగర్ నుంచి కూకట్ పల్లికి వెళ్లే రోడ్డులో విష్ణుప్రియ లాడ్జి పక్క భవనంలో కాంప్లెక్స్ ఉంది. ఆదివారం ఉదయం సెల్లార్ లోని ఒక షట్టర్ వద్ద గుర్తు తెలియని 45 ఏళ్ల మహిళ డెడ్ బాడీని గుర్తించారు. ఒంటి మీద దుస్తులు సరిగా లేకపోవటం.. తీవ్ర రకస్రావమైన ఆనవాళ్లను గుర్తించారు. డెడ్ బాడీ పక్కనే ఉన్న సంచిలో ఒక చీటిపై పేరు ఉండటంతో అది.. ఆమె పేరుగా భావిస్తున్నారు. చిత్తు కాగితాలు ఏరుకొని జీవించే మహిళగా భావిస్తున్నారు.

ఈ ఉదంతంపై రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమేరాలను పరిశీలించారు. పాతికేళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఘటన జరిగిన బిల్డింగ్ పక్కన ఉన్న గల్లీలో కొన్ని నిమిషాలు ఆమెతో మాట్లాడినట్లుగా కనిపించింది. తర్వాత ఆమెను బలవంతంగా సెల్లార్ లోని షెట్టర్ వద్దకు లాక్కెళ్లారు. కాసేపటి తర్వాత ఆ ఇద్దరు యువకులు టూవీలర్ మీద కూకట్ పల్లి వైపు పారిపోయినట్లుగా గుర్తించారు. దారుణ అత్యాచారంతోనే ఆమె మరణించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.