కారుమూరి ట్రాప్‌లో బొలిశెట్టి.. ఏం జరిగింది ..!
వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. వర్సెస్ జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి సత్యనారాయణల మధ్య రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 17 April 2025 1:02 PM ISTవైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. వర్సెస్ జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి సత్యనారాయణల మధ్య రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయంలో బొలిశెట్టి పూర్తి గా కారుమూరి ట్రాప్‌లో చిక్కుకున్నారన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి సహజం గానే ఎదురు దాడులు వస్తాయని.. వాటిని తట్టుకుని నిలబడాల్సిన అవసరం నాయకులకు ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ విషయంలో బొలిశెట్టి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కారుమూరి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉంటే.. అసలు ఏ సమస్య కూడా వచ్చేది కాదు. కానీ, వాటిని పట్టుకుని తొలుత కేసు పెట్టించాలని భావిం చారు. కానీ.. కేసులు పెడితే.. కష్టమని భావించి వదిలేశారు. ఇక, ఎదురు దాడి చేస్తున్నారు. తనకు గన్ మెన్ కూడా వద్దని.. పోలీసులకు కూడా చెప్పనని.. నేరుగా కారుమూరి ఇంటికే వెళ్లి తాడో పేడో తేల్చుకుం టానని కూడా బొలిశెట్టి వ్యాఖ్యానించారు.
విపక్షంలో ఉన్నప్పుడు.. సహజంగానే తమ గ్రాఫ్ పెంచుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తారు. దీనిని ఎదుటి వారు లైట్ తీసుకోవాలి. కానీ, తగుదునమ్మా అంటూ.. కాలు దువ్వితే.. వారి ట్రాప్‌లో కూడా చిక్కు కుంటే ఇబ్బందే కదా? అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు అచ్చంగా.. బొలిశెట్టి ఇదే చేస్తున్నారు. మరోవైపు.. రాజకీయంగా ఆయన ప్రజలకు చేరువ కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ప్రజల మధ్యకువ చ్చి.. పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. కార్యకర్తలలో జోష్ నింపే ప్రయత్నం చేయాలి. కానీ, ఆ దిశగా బొలిశెట్టి అడుగులు వేయడం లేదు. తన వ్యక్తిగత అజెండాల ను అనుసరిస్తూ.. వాటి ప్రకారం రాజకీయం చేయడం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇది భవిష్యత్తును మరింత ఇబ్బంది పెడుతుందని అంటున్నారు పరిశీలకులు. విపక్షాల ట్రాప్‌లో చిక్కుకోకుండా.. ఆలోచనాత్మకంగా రాజకీయాలు చేయాలని సూచిస్తున్నారు.
