Begin typing your search above and press return to search.

B&D మధ్య C అదే జీవితం అంటున్న 14 ఏళ్ల అంధబాలుడు

జీవితం అంటే ఏమిటో ఒక 14 ఏళ్ల అంధ బాలుడు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 May 2025 2:00 AM IST
B&D మధ్య C అదే జీవితం అంటున్న 14 ఏళ్ల అంధబాలుడు
X

జీవితం అంటే ఏమిటో ఒక 14 ఏళ్ల అంధ బాలుడు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతమేశ్ అనే ఈ కుర్రాడు ఒక పాడ్‌కాస్ట్‌లో జీవితం గురించి ఎంతో అర్థవంతమైన వ్యాఖ్యలు చేశాడు. జీవితం అంటే Birth (పుట్టుక), Death (మరణం) మధ్యలో ఉండే 'C' అని, ఆ 'C' అంటే ఛాయిస్ (ఎంపిక) అని ఎంతో చక్కగా చెప్పాడు.

అంతే కాకుండా.. "దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తూనే తాను ఉన్నానని గుర్తు చేసేందుకు అప్పుడప్పుడు కొన్ని సవాళ్లను విసురుతాడు.. మనం ఎదుర్కొనే సవాళ్లన్నీ కాలంతోపాటు కలిసిపోతాయి" అని ప్రతమేశ్ చెప్పిన మాటలు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇంత చిన్న వయసులో అంతటి లోతైన విషయాన్ని చెప్పిన ప్రతమేశ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు.

ప్రతమేశ్ మాటలు వింటుంటే నిజంగా జీవితం అంటే ఇదే కదా అనిపిస్తుంది. పుట్టుక, చావు అనే రెండింటి మధ్య మనకు అనేక ఆప్షన్లు ఉంటాయి. ఆ ఆప్షన్లను బట్టే మన జీవితం ముందుకు సాగుతుంది. సంతోషాలు, కష్టాలు రెండూ జీవితంలో భాగమే. దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చినట్లే, మనం ఆయనను గుర్తుంచుకునేలా కొన్ని కష్టాలను కూడా ఇస్తాడు. అయితే ఆ కష్టాలు శాశ్వతం కావు, కాలంతో కలిసిపోతాయి అని ప్రతమేశ్ చెప్పిన విధానం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.

ఈ 14 ఏళ్ల అంధ బాలుడు చెప్పిన ఈ జీవిత సత్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎంతో మంది ఈ మాటలను షేర్ చేస్తూ ప్రతమేశ్‌ను అభినందిస్తున్నారు. నిజంగా జీవితం అంటే ఇదే కదా, ఇంత బాగా చెప్పాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు.