ఉమ్మడి లక్ష్యం... మోడీని మిస్సైల్స్ అడుగుతున్న బీ.ఎల్.ఏ!
పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్ లను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తూ దాయాదీని వణికించేస్తుంది.
By: Tupaki Desk | 9 May 2025 4:46 AMపాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్ లను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తూ దాయాదీని వణికించేస్తుంది. ఈ సమయంలో.. పాక్ సైన్యాన్ని తరిమికొట్టి, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించిన బీ.ఎల్.ఏ... మోడీకి ఓ రిక్వస్ట్ చేసింది!
అవును... ఓ పక్క భారత్ దాడిని తట్టుకునే క్రమంలో వణికిపోతున్న పాక్ సైన్యాన్ని మరోపక్క బలుచీస్తాన్ కేంద్రంగా బీ.ఏల్.ఏ. సైతం వణికించేస్తుంది. ఇందులో భాగంగా... బలుచిస్తాన్ లోని క్వెట్టాలో తమ యోధులు రంగంలోకి దిగారని.. ఈ సమయంలో పాక్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ కార్యాలయంపై దాడి చేశారని.. దీంతో పాక్ సైన్యం పారిపోయిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే.. త్వరలో మొత్తం బలుచిస్తాన్ ను స్వాధీనం చేసుకుంటామని, స్వాతంత్రం తెచ్చుకుంటామని, సొంత జెండా ఎగరేస్తామని బీ.ఎల్.ఏ. బలంగా చెబుతోంది. ఈ సమయంలో... తమకు సైనిక సహాయం చేయాలని బలూచిస్తాన్ ఫ్రావిన్స్ లోని కొందరు ప్రతినిధులు, పౌరులు, యోధులు కోరుతున్నారు! ఈ సందర్భంగా మోడీకి ఓ రిక్వస్ట్ కూడా పంపారు!
ఇందులో భాగంగా... తాము చేసే యుద్ధంలో పాకిస్థాన్ ను శిక్షించాలంటే భారత్ వెంటనే తమకు సైనిక సాయం చేయాలని బలూచిస్తాన్ కోరుతుంది. పాకిస్థాన్ భూభాగంలో సుమారు 46% ఉన్న బలూచిస్తాన్.. విదేశీ సాయం, ఆయుధాలు లేకుండా పోరాడలేదని చెబుతుంది. అందువల్ల మోడీ సర్ తమకు వెంటనే మిస్సైల్స్ ఇవ్వాలని.. ఫలితంగా అద్భుతాలు చేసి చూపిస్తామని పోస్టులు పెడుతున్నారు.
ఏది ఏమైనా... గత కొంతకాలంగా పాకిస్థాన్ సైన్యానికి చుక్కలు చూపించే ప్రయత్నాలు చేస్తూ.. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి సుమారు 200కు పైగా పాక్ సైనికులను హతమార్చి తమ ప్రతాపం చూపిస్తున్న బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీ.ఎల్.ఏ)... భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ కు మరింత చుక్కలు చూపిస్తుంది.