Begin typing your search above and press return to search.

కూటమిలో బీజేపీ కాలు...జగన్ నెత్తిన పాలు...!?

బీజేపీతో పొత్తు వల్ల ఏపీలో రాజకీయ సామాజిక సమీకరణలు పూర్తిగా మారుతాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2024 6:00 PM IST
కూటమిలో బీజేపీ కాలు...జగన్ నెత్తిన పాలు...!?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా బీజేపీతో కూడా పొత్తుకు వెళ్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల ఏపీలో రాజకీయ సామాజిక సమీకరణలు పూర్తిగా మారుతాయని అంటున్నారు. ఏపీలో చూస్తే వైసీపీ టీడీపీ జనసేన కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

ఇపుడు బీజేపీని పొత్తు వైపు తీసుకుని వస్తే మైనారిటీ వర్గాలతో పాటు కొన్ని సెక్షన్లు దూరం అయ్యే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఆ విధంగా టీడీపీకి పడాల్సిన ఒకటి నుంచి రెండు శాతం ఓట్లు వైసీపీకి టర్న్ అవుతాయని అంటున్నారు. దాంతో వైసీపీ టీడీపీ కూటమి మధ్యన మార్జిన్ ఇంకా పెరుగుతుందని అది గెలుపు అవకాశాలను కూడా తగ్గిస్తుందని అంటున్నారు.

ఇక బీజేపీతో పొత్తు అంటే ఆ పార్టీ ఓటు బ్యాంక్ టీడీపీదీ ఒక్కటే అంటున్నారు. టీడీపీకి పట్టు ఉన్న అర్బన్ ఏరియాలలోనే బీజేపీకి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. అయితే వైసీపీకి రూరల్ సెక్టార్ లో ఎక్కువ పట్టు ఉంది. దాంతో వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ పొత్తు పెద్దగా ఉపయోగపడదు అని అంటున్నారు.

అంతే కాదు ఏపీలో కొన్ని కీలక సెగ్మెంట్లలో మైనారిటీలు ఇతర సామాజిక వర్గాలు కూడా దూరం అవుతారు అని అంటున్నారు. ఈ పరిణామం వైసీపీపే ఉపయోగపడుతుందని కూడా రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ దేశంలో పెద్ద పార్టీగా ఉన్నా కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ వరకూ చూస్తే పెద్దగా ప్రభావం చూపని పార్టీగానే ఉంటుందని అంటున్నారు.

అదే విధంగా ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదు అన్నది జనంలో ఉంది. ఏపీ ప్రస్తుత పరిస్థితికి వైసీపీ బీజేపీ కారణం అని భావించే వారి ఆగ్రహాన్ని అనుకూలంగా మలచుకోవాలంటే బీజేపీతో పొత్తు ఉండరాదు అనే అంటున్నారు. కానీ దానికి విరుద్ధంగా పొత్తు కలపడం వల్ల ఏపీలో వైసీపీ వైఫల్యాలు కూడా కొట్టుకుపోతాయని అంటున్నారు.

ఇక ఏపీలో మేధావులు తటస్థులు, విద్యావంతులు, అభివృద్ధికాములు టీడీపీ కూటమిని సపోర్ట్ చేస్తున్నారు. ఇపుడు వారంతా ఎంతో కొంత దూరం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిణామం వల్ల వైసీపీని వీరు ఓటు వేయకపోవచ్చు కానీ నోటాకు ఓటు వేసే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఆ విధంగా చేసినా కూడా హోరా హోరీ పోరులో ఓటు బ్యాంకు తగ్గి నష్టపోయేది టీడీపీ కూటమి అని అంటున్నారు.

ఇక బీజేపీ అడుగుతున్న సీట్లు అన్నీ కూడా టీడీపీ సీనియర్లు ఉన్న చోటనే అని అంటున్నారు. దాంతో ఇవన్నీ చూసిన తరువాత టీడీపీలో కూడా అసంతృప్తి రేగే చాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో పొత్తులను కలుపుతూ కొత్త ఎత్తులతో ముందుకు సాగుతున్న చంద్రబాబు లాజికల్ గా ఒక విషయం మిస్ అవుతున్నారు అని అంటున్నారు. జగన్ పని అయిపోయింది అని ఒక వైపు చెబుతూ మరో వైపు పొత్తులతో ముందుకు సాగడం వల్ల చెప్పకనే జగన్ బలం చెబుతున్నారని ఆ విధంగా జనాల ఆలోచనలు కూడా మారితే పూర్తి దెబ్బ పడేది కూటమికే అని విశ్లేషిస్తున్నారు.