Begin typing your search above and press return to search.

లోకేష్ కి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం టీడీపీ మాజీల ప్రయత్నాలు!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో బాబు కుటుంబ సభ్యులకు అపాయింట్మెంట్ కోసం రంగంలోకి టీడీపీ మాజీలు సీరియస్ గా దిగుతున్నారా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:14 AM GMT
లోకేష్ కి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం టీడీపీ మాజీల ప్రయత్నాలు!
X

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో బాబు కుటుంబ సభ్యులకు అపాయింట్మెంట్ కోసం రంగంలోకి టీడీపీ మాజీలు సీరియస్ గా దిగుతున్నారా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. గత ఇరవై రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన బీజేపీ ప్రముఖులతో భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతూ వస్తోంది.

ఇక ఆయనను ఈ నెల 4న విజయవాడ సీఐడీ ఆఫీసుకు విచారణకు రమ్మని ఏకంగా ఢిల్లీకి వెళ్ళి మరీ నోటీసులు ఇచ్చి వచ్చారు అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14 గా ఉన్న లోకేష్ కి సెక్షన్ 14 ఏ కింద నోటీసులు జారీ చేశారు.

దాంతో ఆయన సీఐడీ ముందు విచారణకు తప్పనిసరిగా రావాల్సిన సందర్భం అయితే ఉంది. ఒకవేళ వస్తే ఏమి జరుగుతుంది అది అరెస్ట్ దాకా దారి తీస్తుందా అన్నది కూడా ఒక పెద్ద డౌట్ గా ఉంది. ఈ నేపధ్యం ఇలా ఉంటే వరసబెట్టి బాబు మీద కేసులు ఏపీ సర్కార్ పెడుతోంది అంటున్నారు.

దీనికి తోడు అన్నట్లుగా 2015లో ఓటుకు నోటు కేసులో బాబు దొరికారు అన్న దాని మీద తెలంగాణా ఏసీబీ ఆ కేసుని సరిగ్గా దర్యాప్తు చేయలేదని పేర్కొంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ మీద కోర్టు లిస్టింగ్ చేసి మరీ ఈ నెల 4న విచారించబోతోంది.

ఇలా ఒకదాని మీద మరొకటి అన్నట్లుగా కేసులు పెరుగుతున్నాయి. చిక్కులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ పెద్దలతో భేటీ అయి ఏపీ సర్కార్ దూకుడుకి బ్రేక్ వేయాలన్నది టీడీపీ ఎత్తుగడగా ఉంది.

అయితే ఆ వైపు నుంచి చూస్తే అపాయింట్మెంట్ అయితే దొరకడంలేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో ఉంటూ బాబుకు అత్యంత సన్నిహితులుగా మెలుగుతూ బీజేపీలోకి వెళ్ళిన నాయకులు ఇపుడు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని అంటున్నారు వారు బాబు ఫ్యామిలీకి బీజేపీ కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్ ఇప్పించే విషయంలో తన పని తాము చేయడానికి రంగంలోకి దిగారని అంటున్నారు.

తాజాగా చూస్తే ఆదివారం రాజమండ్రి వచ్చిన బీజేపీ ఎంపీ మాజీ టీడీపీ తమ్ముడు సీఎం రమేష్ భువనేశ్వరి బ్రాహ్మణిలను కలిశారు. వారితో తాజా పరిస్థితుల మీద చర్చించినట్లుగా భోగట్టా. అదే విధంగా చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ కేసుల విషయం బీజేపీ కేంద్ర పెద్దలకు తెలియచేయడమే కాకుండా అపాయింట్మెంట్ ఇప్పించేలా చూడాలన్న దాని మీద చర్చ సాగింది అని అంటున్నారు. మొత్తానికి మాజీలు రంగంలోకి దిగుతున్నారు. అపాయింట్మెంట్ బీజేపీ నుంచి దక్కుతుందా అన్నది కీలక పాయింట్. ఒకవేళ దక్కితే మాత్రం టోటల్ సీన్ కొత్త రూపుకు షేప్ కి మారుతుంది అని అంటున్నారు.