రెడ్డి వర్సెస్ బీసీ : బీజేపీ ఓటు ఎవరికి ?
ఏపీలో ప్రస్తుతం ఉన్న బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని అనుకుంటోంది.
By: Tupaki Desk | 28 April 2025 5:00 AM ISTఏపీలో బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో కమలం ప్లాన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. నిజానికి ఏపీలో బీజేపీకి ఈ రోజుకీ సరైన బలం లేదు. పొత్తులతో మొన్నటి ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు సాధించింది. అయితే ఏపీలో విస్తరించేందుకు గల అవకాశాలను బీజేపీ చూస్తోంది. మిత్ర పక్షాలు టీడీపీ జనసేన రాజకీయ సామాజిక సమీకరణలను అంశాలను బేరీజు వేసుకుంటూ రాజకీయ మైదానంలో తన వాటాను అందుకోవాడానికి చూస్తోంది.
ఏపీలో ప్రస్తుతం ఉన్న బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని అనుకుంటోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరిని మార్చి మరో బలమైన సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బాగా ఉంటుందని ఆలోచనలు చేస్తోంది. ఇక చూస్తే కనుక టీడీపీ పట్ల కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఆకర్షణలో ఉంది. ఒక బలమైన బంధం ఆ పార్టీ చుట్టూ అల్లుకుని ఉంది.
మరో వైపు చూస్తే జనసేన చుట్టూ కాపులు ర్యాలీ అవుతున్నారు. ఇలా మిత్రులకు బలమైన సామాజిక వర్గాల అండ ఉంది. దాంతో బీజేపీ మిగిలిన సామాజిక వర్గాలను చేరువ చేసుకునే ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు దాంట్లో ముఖ్యమైనది రెడ్డి సామాజిక వర్గం అని అంటున్నారు. అయితే ఏపీలో వైసీపీతో రెడ్లు ఉన్నారని కూడా చెప్పాల్సి ఉంది.
కానీ 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీని విపరీతంగా ఆదరించిన రెడ్లలో ఇపుడు కొంత మార్పు వచ్చిందని బీజేపీ పెద్దలు అంచనా కడుతున్నారు. దాంతో ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే ఏపీలో తాము కూడా బలంగా నిలబడగలమని నమ్ముతోంది. అంతే కాదు వైసీపీని వీక్ చేస్తే పొలిటికల్ గా ఏర్పడే స్పేస్ లోకి వెళ్ళవచ్చు అన్న లెక్కలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ కొత్త ప్రెసిడెంట్ రెడ్డి కమ్యూనిటీ నుంచి వస్తారా అన్న చర్చ ఒక వైపు సాగుతోంది. దాంతో రాయలసీమకు ఈసారి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. సీమ నుంచి ఒక మాజీ సీఎం తో పాటు కీలక నేతలు ఏపీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారని చెబుతున్నారు.
మరో వైపు చూస్తే కనుక బీసీలకు కూడా చాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా బీజేపీలో హాట్ డిస్కషన్ గా ఉంది అంటున్నారు. ఏపీలో బీసీలకు ఈ కీలకమైన పదవి ఇస్తే బీజేపీ కూడా సామాజికవర్గ పరంగా సరైన వ్యూహం అనుసరించినట్లు అవుతుందని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఉత్తరాంధ్రాలో బలమైన బీసీ నేతకు లక్కీ చాన్స్ ఉందని అంటున్నారు.
అయితే ప్రచారం జరుగుతున్న దానిని బట్టి చూస్తే కనుక కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. ఆయన అంగబలం అర్ధబలం నిండుగా ఉన్నవారు అని అంటున్నారు. ఆయనకు ఈ పోస్ట్ ఇస్తే పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకునిపోగలరని భావిస్తున్నారు. అయితే ఆయనకు ఇవన్నీ ప్లస్ గా ఉన్నా కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ కొంత బ్రేకులు వేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.
బీజేపీలో హరిబాబు పురంధేశ్వరి ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఎక్కువ కాలం వీరి వద్దనే ఈ పదవి ఉంది. మధ్యలో సోము వీర్రాజుతో పాటు కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చారు. అయితే బీసీలకు మాత్రం ఈ పదవి దక్కలేదు. ఏపీలో పెద్ద సంఖ్యలో వారు ఉన్నారు. వారికి పదవి ఇస్తే తమ వైపు ఎంతో కొంత మొగ్గు చూపే అవకాశం ఉందని బీజేపీ లెక్క వేస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణాలో ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ పదవి ఇచ్చారు. రేపు అక్కడ ఎవరికి ఈ పదవిని ఇచ్చారో దానిని చూసుకుని ఏపీలో మరో కీలకమైన సామాజిక వర్గానికి ఈ పదవి ఇవ్వవచ్చు అని అంటున్నారు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కీలక సామాజిక వర్గాలు అన్నీ సమీకరణలు చూసుకుంటూ ఎదగాలని బీజేపీ పెద్దలు భావిసుత్న్నారు అని అంటున్నారు.
