Begin typing your search above and press return to search.

బూతు ఆడియో వైరల్... స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన టీడీపీ!

ఇందులో భాగంగా... "మొన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఈటీవీ వీడియోతో ఫేక్, నేడు భువనేశ్వరి గారి ఆడియోని డీప్ ఫేక్ చేశారు.

By:  Tupaki Desk   |   26 April 2024 8:37 AM GMT
బూతు ఆడియో వైరల్... స్ట్రాంగ్  గా రియాక్ట్  అయిన టీడీపీ!
X

సోషల్ మీడియాలో ఓ ఆడియో ట్రాక్ వైరల్ అవుతోంది. ప్రధానంగా శుక్రవారం ఉదయం నుంచి ఈ ఆడియో ట్రాక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ ఆడియోలో ఒక మహిళ పచ్చి బూతులతో చెలరేగిపోతూ వినిపించింది. కులంహారంతో, కుటుంబహంకారంతో ఒక మహిళ.. కులం పేరుతో మరో వ్యక్తిని దూషిస్తున్నట్టుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో... ఈ ఆడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

అవును... శుక్రవారం ఉదయం నుంచి ఏపీ రాజకీయాల్లో ఒక మహిళకు సంబంధించిన ఆడియో ట్రాక్ వైరల్ గా మారింది. ఆ ఆడియో క్లిప్ లో ఒక మహిళ బరితెగించి మాట్లాడుతున్న బూతులు ధ్వనించాయి! అయితే... ఆ ఆడియోలో ఉన్న వాయిస్ నారా భువనేశ్వరిది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం అదే పేరుతో ఆ ఆడియో ట్రాక్ సర్కులేట్ అవుతోంది. దీంతో.. గతం గుర్తు చేసుకుంటూ ఫైరవుతున్నారు ఆ పలువురు ప్రజానికం!

ఈ సమయంలో టీడీపీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. ఆన్ లైన్ వేదికగా అది "డీప్ ఫేక్" అంటూ కొట్టిపారేసింది. కావాలనే వైసీపీ ఇలాంటివి సృష్టించిందని టీడీపీ నుంచి బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో.. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కౌంటర్ ట్వీట్ భారీగా పడింది. ఇది పూర్తిగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ ఫైర్ అయ్యింది.

ఇందులో భాగంగా... "మొన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఈటీవీ వీడియోతో ఫేక్, నేడు భువనేశ్వరి గారి ఆడియోని డీప్ ఫేక్ చేశారు.

జగన్ రెడ్డి... భువనేశ్వరి గారంటే ఎందుకు నీకు అంత కడుపు మంట..? అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావ్, ఇప్పుడు ఆమె ఆడియోని ఫేక్ చేసావ్..!

ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని, ఓట్లు కోసం ఇంతగా దిగజారతావా..? ఏమి బ్రతుకు జగన్ నీది..?" అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది టీడీపీ.

మరోపక్క... ఆ ఆడియో రికార్డింగ్ లో ఉన్న గొంత ఎవరిది..? ఎవరి గొంతును పోలి ఉంది..? ఆ ఆడియోలో వినిపిస్తున్నట్లు ఆమె అంత ఘాటుగా ఎవర్ని తిట్టింది.. ఎందుకు తిట్టింది..? అనే విషయంపై మాత్రం పూర్తి స్పష్టత రావాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. డీప్ ఫేక్ ఆడియోలు, వీడియోలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీకి నెటిజన్లు సలహా ఇస్తున్నారు!