Begin typing your search above and press return to search.

కేసు మెరిట్స్ పై కాదు ఆరోగ్య కారణాల పైనే బెయిల్...!

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు అనారోగ్యం పేరిట ఒక వర్గం మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Oct 2023 7:02 AM GMT
కేసు మెరిట్స్  పై కాదు ఆరోగ్య కారణాల పైనే బెయిల్...!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు జైల్లో 52 రోజులుగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో... ఇన్నేళ్ళుగా వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ పబ్బం గడిపిన చంద్రబాబు.. ఇన్నాళ్లకు చట్టానికి చిక్కి, జైల్లో అర్థశతదినోత్సవం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో... అనారోగ్య కారణలతో చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ దక్కింది!

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సుమారు రూ.374 కోట్ల అవినీతికి పాల్పడటంతోపాటు.. ఏపీ పైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, తాజాగా ఏపీ లిక్కర్ స్కాంలలో కీలక సూతారధారిగా ఉన్నారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది! ఆరోగ్య కారణాల రీత్యా ఈ బెయిల్ మంజూరు కావడం విశేషం! ఈ క్రమంలో బెయిల్ చంద్రబాబు తిరిగి నవంబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి సరెండర్ అవ్వాలని కోర్టు ఆదేశించింది!

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు అనారోగ్యం పేరిట ఒక వర్గం మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... చంద్రబాబుకు చర్మ వ్యాధి సమస్యలు ఉన్నాయని.. కంటి సమస్య ఉందని.. బీపీ, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నాయని, బరువు బాగా తగ్గారని.. ఫలితంగా అది కిడ్నీలకు ఎఫెక్ట్ అవుతుందని.. ఇలా పలు అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ వస్తోందనే ఆరోపణలు బలంగా వినిపించాయి.

మరోపక్క సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు విషయంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకోవడమే కాకుండా ఎన్నడూ లేనిది ఆయనకు ఎయిర్ కండిషనర్ కూడా ఏర్పాటు చేయడానికి సహకరించింది. ఈ విషయంపై బాబు లాయర్లు కోర్టులో పిటిషన్ వేయగా... ప్రభుత్వం తరుపున ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు! అప్పటికే ఇంటినుంచి భోజనం, మందులు అందే సౌలభ్యం కూడా కల్పించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కేస్ మెరిట్స్ మీద కాకుండా... అనారోగ్య కారణాల రీత్యా మాత్రమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో భాగంగా... చంద్రబాబుకు కుడి కంటి ఆపరేషన్ కోసం షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను ఇచ్చింది. ఈ సమయంలో... ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని తెలిపింది. ఇదే సమయంలో సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది.

చంద్రబాబుకు కోర్టు విధించిన షరతులు!:

1. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు!

2. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు!

3. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి.. ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది!

4. చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీ ఎస్కార్ట్ ఉంచాలి అంటున్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి!

5. జెడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో... కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలి. చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదు!