Begin typing your search above and press return to search.

పవన్...పీకే అయిపోయారు : కాంగ్రెస్ తో పొత్తుకు సైతం బాబు...!?

జనసేనతో పొత్తు పెట్టుకున్నారు పవన్ గ్లామర్ ప్లస్ ఆయన సామాజిక వర్గం అండతో ఈసారి గెలవవచ్చు అని భావించారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 4:38 PM GMT
పవన్...పీకే అయిపోయారు :  కాంగ్రెస్ తో పొత్తుకు సైతం బాబు...!?
X

వచ్చే ఎన్నికల్లో గెలిచే మార్గం తెలియక టీడీపీ అధినేత చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారా. ఆయన ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లుగా తెగ తిరుగుతున్నా ఫలితం కనబడడంలేదా అన్నది చర్చకు వస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు పవన్ గ్లామర్ ప్లస్ ఆయన సామాజిక వర్గం అండతో ఈసారి గెలవవచ్చు అని భావించారు.

అయితే తెలంగాణాలో జరిగిన ఎన్నికలతో జనసేన బలం ఏంటో తేలిపోయింది. అక్కడ జనసేనకు డిపాజిట్లే దక్కలేదు. దాంతో ఆ పార్టీతో వెళ్తే ఎలాగుంటుందో అన్న బెంగతో బాబు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ని ప్రత్యేక విమానంలో రప్పించి మరీ మూడు గంటల పాటు మంతనాలు జరిపారు.

అయినా కూడా ఏమీ వర్కౌట్ కాలేదు. ఆయన కూడా పరిస్థితి చేయి దాటిపోయింది. అఖరి నిమిషంలో ఏమి చేయలేనని చేతులెత్తేశాడని టాక్. దానికి తోడు జనసేన విషయంలో నారా లోకేష్ అన్న మాటలు పవన్ కి సీఎం పదవి షేర్ చేయలేమని చెప్పిన మాటలు బూమరాంగ్ అయ్యాయి. అటు జనసేన గుర్రుగా ఉంది. ఇటు కాపు సామాజిక వర్గం యాంటీ అయింది.

దీంతో మరింత ఇరకాటంలో టీడీపీ పడిపోయింది అని అంటున్నారు. దాంతో పుట్టు వ్యతిరేకి అయిన కాంగ్రెస్ తో సైతం పొత్తులకు చంద్రబాబు ఆరాటపడుతున్నారా అంటే కర్నాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో బాబు బెంగళూరు విమానాశ్రయం లో జరిపిన ఏకాంత మంతనాలు అదే నిజం అంటున్నాయని తెలుస్తోంది.

సింగిల్ గా అయితే వైసీపీని జగన్ని ఎదుర్కోవడం కష్టమని భావించిన చంద్రబాబు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు అని అంటున్నారు. అందులో భాగమే డీకేతో మంతనాలు అని అంటున్నారు. ఏపీలో చూస్తే టీడీపీ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోంది అంటున్నారు.

అదే విధంగా చూస్తే వైసీపీకి ఎదురులేదని సర్వేలు తేల్చేస్తున్నాయి. జనసేన మద్దతు పెద్దగా అక్కరకు రాదు అని అంటున్నారు. కాపులు జనసేనను నమ్మే స్థితిలో లేరని కూడా తెలుస్తోంది అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారు కావడంతో చంద్రబాబు కొత్త దారులు వెతుకుతున్నారు అని అంటున్నారు.

ఏపీలో చూస్తే దాదాపుగా నలభై నుంచి యాభై సీట్లలో టీడీపీకి అభ్యర్ధులు లేని వాతావరణం ఉంది అంటున్నారు. దాంతో వైసీపీ పోటీ నుంచి తప్పించిన వారిని చేరదీసి వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో ఎలాగైనా టీడీపీని గాడిలో పెట్టాలని బాబు ఆరాటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు.

అందులో భాగమే డీకే శివకుమార్ తో భేటీ కావడం అంటున్నారు. ఏపీలో పవన్ వల్ల ఏమి కాదని తేల్చేసిన చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టడానికి రెడీ అవుతున్నారు అని అంటున్నారు. ఇవన్నీ చంద్రబాబు దింపుడు కల్లం ఆశలుగా పేర్కొంటున్నారు. ఇప్పటిదాకా ఎన్ని విన్యాసాలు చేసినా కూడా టీడీపీకి కనుచూపుమేర విజయ సూచికలు కనిపించడంలేదు అని అంటున్నారు.

అందుకే డీకేకి దగ్గర కావాలని చూస్తున్నారు అంటున్నారు. ఇలా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇపుడు అదే కాంగ్రెస్ తో జత కట్టడానికి కూడా వెనుకాడడం లేదని అంటున్నారు. లేకపోతే రాష్ట్రంలో జగన్ ను ఎదుర్కొవడం అంత తేలిక కాదని అర్ధమైపోయింది అని అంటున్నారు.

తాజాగా కర్నాటక, తెలంగాణాలో గెలిచిన కాంగ్రెస్ వైపు బాబు టర్న్ అవుతున్నట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. దీనిలో భాగంగా బెంగుళూరు వెళ్ళి కాంగ్రెస్ చీఫ్ డికె.శివకుమార్ ను కలిశారని అంటున్నారు. ఏకంగా ఎయిర్ పోర్ట్ లోనే డీకేతో మంతనాలు చంద్రబాబు చేయడం బట్టి చూస్తే బాబు రాజకీయం ఏంటో అర్ధం అవుతోంది అంటున్నారు.

ఇక ఏపీలో టీడీపీకి గ్రాఫ్ పడిపోవడం మరోపక్క అధికార వైసీపీ ఏ సర్వే వచ్చినా విజయపథాన దూసుకుని పోవడం వల్లనే చంద్రబాబు ఇలా జోరు పెంచారని అంటున్నారు. మరి జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమైందా అన్నది గట్టిగానే వినిపిస్తున్న మాటగా ఉంది.