Begin typing your search above and press return to search.

పవర్ ఫుల్ పంచ్ : బాబుకు గుర్తింపు లేదు...పవన్ కు ఎన్నికల గుర్తు లేదు...!

ఏపీ జనాలలో బాబు పరపతి బాగా తగ్గిందని అలాంటి చంద్రబాబు ఏదో జరిగిపోతోందని చెబుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం విచిత్రంగా ఉందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు

By:  Tupaki Desk   |   9 Jan 2024 11:26 AM GMT
పవర్ ఫుల్ పంచ్ : బాబుకు గుర్తింపు లేదు...పవన్ కు ఎన్నికల గుర్తు లేదు...!
X

వైసీపీ టీడీపీ జనసేన కూటమి మీద ఘాటైన కామెంట్స్ చేసింది. ఏపీలో చంద్రబాబుకు జనంలో గుర్తింపు లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఆయన వెంట ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి గాజు గ్లాస్ గుర్తే లేదు అని ఎత్తిపొడిచారు . ఈ ఇద్దరూ కలసి సీఈసీకి ఫిర్యాదు చేయడమేంటి అని ఫైర్ అయ్యారు. ఏపీ జనాలలో బాబు పరపతి బాగా తగ్గిందని అలాంటి చంద్రబాబు ఏదో జరిగిపోతోందని చెబుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం విచిత్రంగా ఉందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు

నిజానికి చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. అసలు ఏపీలో దొంగ ఓట్లు అన్నదే టీడీపీ నుంచి ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిని తాము ఆధారాలతో సహా ఈసీకి వివరించారని ఆయన తెలిపారు. మేం ఆధారాలతో సహా టీడీపీ చేస్తున్న దొంగ ఓట్ల నమోదును సీఈసీ దృష్టికి తెచ్చామని తెలిపారు

ఏపీలో వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తుంటే టీడీపీ, జనసేన చూడలేక పోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సీఈసీకి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించామని వివరించారు. మరో వైపు ఏపీకి తెలంగాణకు ఒకేసారి లోక్ సభ ఎన్నికలు పెట్టాలని కోరామని ఆయన తెలిపారు.

ఇక జనసేనకి గుర్తింపు లేకున్నా సీఈసీ మీటింగుకు ఎందుకు ఆహ్వానించారని అడిగామని అన్నారు. అదే విధంగా గాజు గ్లాస్ గుర్తు ఇపుడు ఏపీలో సాధారణ గుర్తు అని సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధమని సీఈసీకు చెప్పామని మంత్రి జోగి రమేష్ తెలిపారు.

అదే విధంగా రెడ్‌బుక్ పేరుతో అధికారులపై లోకేష్ చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలనై కోరినట్లుగా కూడా తెలిపారు. మొత్తం మీద చూస్తే టీడీపీ జనసేనలతో పాటు వైసీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చాయి. ఈ మూడు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

ఏపీలో ఎన్నికల సంఘం పూర్తి అధికార యంత్రాంగాన్ని ముందు పెట్తుకుని ప్రతీ అంశం మీద నిశిత పరిశీలన చేస్తోంది. దాంతో రాజకీయ నాయకులు పార్టీలు చేసే ఫిర్యాదుల మీద కూడా తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకుని ముందుకు సాగుతోంది. ఆధారాలు ఉంటే కచ్చితంగా చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.