పథకాలు కాదు.. మళ్లీ 'ఫేస్' వాల్యూనే.. !
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. మళ్లీ బాబు వర్సెస్ జగన్ మధ్యే ఓట్ల యుద్ధం జరుగుతుందా? వారి ఫేస్ వాల్యూ... పనితీరు ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయా? అంటే.. కొందరు విశ్లేషకులు ఔననే చెబుతున్నారు.
By: Tupaki Desk | 11 May 2025 4:00 AM ISTఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. మళ్లీ బాబు వర్సెస్ జగన్ మధ్యే ఓట్ల యుద్ధం జరుగుతుందా? వారి ఫేస్ వాల్యూ... పనితీరు ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయా? అంటే.. కొందరు విశ్లేషకులు ఔననే చెబుతున్నారు. గత 2019 ఎన్నికల్లో కూడా ఇదే జరిగిందని.. పాదయాత్ర చేసిన జగన్ ఫేస్ వాల్యూ పనిచేసిందని అంటున్నారు. తర్వాత.. 2024కు వచ్చేసరికి చంద్రబాబు ఫేస్ వాల్యూతో పాటు.. ఆయన అనుభవం.. కూడా పనికి వచ్చిందని అంటున్నారు.
అయితే.. అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే.. సూపర్ సిక్స్ హామీల వ్యవహారంపై క్షేత్రస్థాయిలో చర్చ సాగుతోంది. గత ఏడాది ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో.. ఉచిత సిలిండర్ల పథకం మినహా.. ఏదీ అమలు కావడం లేదని.. చంద్రబాబు ఆయా పథకాలకు మంగళం పాడేశారని.. ఇటీవల జగన్ చెప్పుకొచ్చారు. కానీ.. వాస్తవానికి కూటమి సర్కారుకు ఇంకా ఏడాది కూడా నిండలేదు. దీనిని బట్టి ఆయా పథకాలను అమలు చేసేందుకు ఇంకా సమయం ఉంది. కానీ.. వైసీపీ మాత్రం విమర్శలు చేస్తోంది.
ఈ క్రమంలోనే పథకాలు-ప్రభుత్వాలు.. అనే విషయంపై సోషల్ మీడియా సహా .. వెబ్ సైట్ ప్లాట్ ఫాంల పై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో పథకాలు ఇచ్చిన జగన్‌ను ప్రజలు చిత్తుగా ఓడించిన విషయాన్ని మేధావులు ప్రస్తావించారు. 40 శాతం మంది ప్రజలు మాత్రమే జగన్ వైపు ఉన్నారని.. 60 శాతానికి పైగా చంద్రబాబు వైపు మద్దతు తెలిపారని .. దీనిని బట్టి పథకాల ప్రభావం ఎంత ఉందని అనుకున్నా.. 33 శాతానికి మించి ఉండదని లెక్కలు వేస్తున్నారు.
సో.. ఇప్పుడు సూపర్ సిక్స్ ప్రభావం ఉంటుందని వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అనుకోవడం భ్రమేనని అంటున్నారు. ``ప్రజలు తమ కాళ్లపై తాము ఆధారపడాలని కోరుకుంటారు.ప్రభుత్వం నొక్కే బటన్ల కోసం ఎదురు చూడరు. సో.. ఇప్పుడు చంద్రబాబు తొలి మాధ్యమాన్ని ఎంచుకున్నారు. ప్రజలు ఆత్మ గౌరవంతో బతికేలా చేస్తున్నారు. ఇది ఆయన ఫేస్ వాల్యూను మరింత పెంచింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఇదే పనిచేస్తుంది`` అని చెబుతున్నారు.
