Begin typing your search above and press return to search.

జగన్ రోజాల మీద దిగజారిన భాషతో అయ్యన్న...!

చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి, అనేక ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి కూడా చేశారు. ఏడు పదులకు చేరువలో ఉన్న నేత

By:  Tupaki Desk   |   21 Feb 2024 1:14 PM GMT
జగన్ రోజాల మీద దిగజారిన భాషతో అయ్యన్న...!
X

చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి, అనేక ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి కూడా చేశారు. ఏడు పదులకు చేరువలో ఉన్న నేత. ఆయన నోటి వెంట ఇటీవల దారుణమైన భాష వస్తోంది. ఆయన టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. అయితే ఆయన ఫైర్ అంతా సభ్యత మరచి బహిరంగ సభలలో చూపించడంతో అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నారా లోకేష్ శంఖారావం సభలో అయ్యన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మీద మంత్రి రోజా మీద అసభ్య పదజాలమే ఉపయోగించారు. అదే వేదిక మీద ఉన్న నారా లోకేష్ సహా అంతా నవ్వుతుండగా ఉత్సాహంగా అయ్యన్న తన ప్రసంగం కొనసాగించడం విశేషం. ఈ సభకు తరలివచ్చిన మహిళలు ఎదురుగా ఉండగానే మహిళా మంత్రి రోజా మీద ఆయన చేసిన కామెంట్స్ కూడా దారుణం అని అంటున్నారు.

మంత్రి రోజాను పట్టుకుని అడవి పంది అని ముఖ్యమంత్రి జగన్ ని నా కొడకా అంటూ అయ్యన్న రెచ్చిపోయి మాట్లాడడమే సంచలనంగా మారింది. మంత్రి రోజా కబడ్డీ ఆడుతూంటే తాను టీవీలో చూసాను అని అయ్యన్న చెబుతూ అది ఎలా ఉంది అంటే బలసిన అడవి పందిలా ఆడుతోంది అని నీచమైన భాషనే వాడేశారు.

ఇక జగన్ ని పట్టుకుని నా కొడకా అని అయ్యన్న దిగజారే మాట్లాడారు. దొంగోడు అని సైకో అని ఇంకా అనేక రకాలుగా తిట్ల పురాణం లంకించుకున్నారు. వేదిక మీద తన కుమారుడు రాజకీయ వారసుడు విజయ్ ఉన్నారు. అలాగే తన కంటే చాలా చిన్న వయసులో ఉన్న లోకేష్ ఉన్నారు. వారు భావి నాయకులుగా ఎదగాలని చూస్తున్నారు.

మరి సీనియర్ మోస్ట్ లీడర్ గా అయ్యన్నే ఇలాంటి భాష వాడితే వారు ఎలాంటి భాష మాట్లాడుతారు అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా అని అంటున్నారు. విపక్షానికి విమర్శించే హక్కు ఉంది. కానీ అది సభ్య సమాజంలో అంతా వినేలా చూసేలా ఉండాలని అంటున్నారు.

జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని విమర్శ చేయవచ్చు కానీ రాక్షస కొడకా నా కొడకా అన్న పదాలు అవసరమా అయ్యన్నా అని అంతా అడుగుతున్నారు. రోజా కబడ్డీ చూపించడానికే జగన్ ఎనిమిది వందల కోట్లు ఆడుదాం ఆంధ్రాలో వృధాగా ఖర్చు చేశారు అని అయ్యన్న విమర్శించారు.

జగన్ రోడ్డు మీద ఆరు కిలోమీటర్లు కూడా వెళ్ళలేరని దానికి ఆయనకు హెలికాప్టర్ కావాలని అయ్యన్న ఘాటు విమర్శలు చేశారు. అయితే అయ్యన్న దిగజారుడు భాష మీద ఆయనను పట్టుకుని సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు కూడా అంతే స్థాయిలో ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు.

అయితే అయ్యన్న బూతులు మరో మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని బూతులకు సరిపోయాయని కొందరు అంటున్నారు. ఎవరు ఏమి అన్నా కూడా అది ప్రజామోదంగా ఉందాలి. సంఘంలో ఉన్న వారు అందునా రాజకీయాల్లో ఉన్న వారు భాష జాగ్రత్తగా వాడాలి. ఇదే విషయం ఇటీవల ఉప రాష్ట్రపతిగా చేసిన ఎం వెంకయ్యనాయుడు లాంటి వారు కూడా విశాఖలోనే చెప్పారు. మరి రాజకీయాలు ఇంతలా దిగజారుడుగా ఉండడం అంటే జనాలే ఆలోచించాలి.